రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో జాబ్, అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

Header Banner

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో జాబ్, అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

  Tue Dec 24, 2024 08:00        Employment

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ANM / GNM / B.Sc Nursing చదివిన వారికి జర్మనీ దేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), OMCAP, CURA PERSONAL ద్వారా జర్మన్ భాషలో శిక్షణ, జర్మనీ దేశంలో ఉద్యోగ కల్పించేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. ఏపీ ప్రభుత్వం యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ANM / GNM / B.Sc Nursing చదివిన వారికి జర్మనీ దేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss

 

దీనికి సంబంధించి అభ్యర్థులకు 6 నెలల పాటు జర్మన్ భాషలో A1, A2, B1, B2 స్థాయిలు శిక్షణ అందించనున్నారు. గుంటూరులో ఇచ్చే ఈ శిక్షణలో రెసిడెన్షియల్ , డే స్కాలర్స్ భోజనం , వసతి అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల వీసా ఫీజు, రానుపోను విమాన టిక్కెట్లు CURA Personal వారు చెల్లిస్తారు. జర్మనీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు యూరో €2400 నుండి €3500 వరకు లభించవచ్చు. (భారత కరెన్సీలో సుమారు రూ.2,33,000 నుండి రూ. 3,26,000 వరకు) ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయోడేటా, విద్యా సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సర్టిఫికెట్, జననం ధృవీకరణ పత్రం, అనుభవ సర్టిఫికెట్, వివాహ ధృవీకరణ పత్రం, నోటరీ లెటర్, నర్సింగ్ కౌన్సిల్ సర్టిఫికెట్, కోవిడ్, MMR సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం https://shorturl.at/XZ1Gr మరింత సమాచారం కోసం 99888 53335 నంబర్ను సంప్రదించవచ్చు.



ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!

 

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడా? పదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Jobs #Unemployment #AndhraPradesh #APPolitics #APNews #Kakinada