హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్లాట్స్ కొంటున్నారా? అక్కడ కొంటే అవస్థలే.. అది ఏమిటో తెలుసుకొండి!

Header Banner

హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్లాట్స్ కొంటున్నారా? అక్కడ కొంటే అవస్థలే.. అది ఏమిటో తెలుసుకొండి!

  Tue Feb 20, 2024 12:25        Real Estate

హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైనా కొంత సొంత జాగా ఉండాలని చాలా మందికి కోరిక ఉంటుంది. భూమి విలువ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. పైసాపైసా కూడబెట్టి పిల్లల చదువులు, పెళ్లిళ్లు సహా ఇతర అవసరాలకు పనికొస్తుందని ఎక్కడో ఒకచోట పెట్టుబడులు పెడుతుంటారు. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకొని పూర్తి అవగాహనతో స్థలం కొంటేనే భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది.

 

ఇంకా చదవండి:  నేడు విశాఖ ఐఐఎం, తిరుపతిలోని ఐఐటీ, ఐసర్ ప్రాంగణాలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ!!

 

Hyderabad Real Estate: రియల్ ఎస్టేట్‌కు ఇటీవలి కాలంలో డిమాండ్ బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. రేట్లు రోజులు, నెలల వ్యవధిలోనే ఆశ్చర్యకర రీతిలో పెరుగుతున్నాయి. మహానగరంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో అద్దెకు ఉండాలంటే కూడా కష్టంగా ఉంది. రెంట్లు అలా ఉన్నాయి మరి. దీంతో చాలా మంది ఎలాగైనా కష్టపడి మహానగరంలో కొంత ప్లేస్ కొనుక్కోవాలని చూస్తున్నారు. ఇది భవిష్యత్తులో తమ పిల్లలకు, వారి చదువులు, పెళ్లిళ్లకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. అయితే తొందరపడి అవగాహన లేకుండా స్థలం కొనుగోలు చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దళారులు, తెలిసిన వారెవరో చెప్పారని ఎక్కడ పడితే అక్కడ భూమి కొంటే చివరికి పైసలన్నీ పోయి ఆందోళన.. ఆవేదనే మిగులుతాయి.

 

ఇంకా చదవండి:  శంభు, సింగు, టిక్రీ బోర్డర్ లో రైతుల ఆందోళన! రేపు చలో ఢిల్లీ మార్చ్ చేపడుతున్నాం!

 

ఇందుకే హైదరాబాద్ నగరంలో భూమిపై పెట్టుబడి పెట్టడం ఎంత ప్రయోజనకరమో.. కొనే వేళ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అంతే ఉందని తెలుసుకోవాలి. ముఖ్యంగా చెరువులు, కుంటలు, వాగులున్న చోట వెంచర్లలో కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

 

ఇంకా చదవండి:  పార్టీ విస్తరణకు తమిళ హీరో విజయ్ కీలక సూచనలు! వివిధ పార్టీ మద్దతుదారులు ఎంతమంది ఉన్నారు?

 

భూముల ధరలు అనూహ్యంగా పెరగడంతో.. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ కొంచెం జాగా కనిపించినా కూడా లేఅవుట్ వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీస్తున్నారు. నీటి నిల్వ సామర్థ్యం (చెరువుల ఎఫ్‌టీఎల్) ఉన్న ప్రాంతాల్ని కూడా వదిలిపెట్టట్లేదు. దీంతో కొనుగోలు దారులు మోసపోతున్నారు.

 

ఇంకా చదవండి:  నేడు(20-02-2024) కుప్పం నియోజకవర్గం "నిజం గెలవాలి" షెడ్యూల్!!

 

HMDA పరిధిలోని శివారు ప్రాంతాలైన మేడ్చల్- మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, సిద్ధిపేట, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్ వంటి చోట్ల లేఅవుట్ వేయాలంటే DTCP లేదా హెచ్ఎండీఏ అనుమతి తప్పనిసరి. దీనికి రకరకాల నిబంధనలు ఉంటాయి. ముందు అది వ్యవసాయేతర భూమి అయి ఉండాలి. ప్రభుత్వానికి నాలా టాక్స్ చెల్లించాలి. చెరువుల FTL లు ఇతర నిషేధిత స్థలాలై ఉండకూడదు.

 

ఇంకా చదవండి:  ఖతార్: జాతీయ క్రీడా దినోత్సవం! పాల్గొన్న ఇండియన్ కమ్యూనిటీ! కోలాహలం గా ఆటలు!

 

వీటిని తప్పించుకునేందుకు చాలామంది ఫాం ల్యాండ్ పేరుతో చెరువుల ఫుల్ ట్యాక్ లెవెల్ ప్రాంతాల్ని విడిచి పెట్టడం లేదు. ఆయా ప్రాంతాలలో పట్టాలున్న వారిని మభ్యపెట్టి వారి నుంచి భూమి అనధికారికంగా సేకరించి వెంచర్లు వేసి అమ్ముతున్నారు. ఇలాంటి చోట కొంటే డబ్బు పోగొట్టుకోవడమే కాకుండా.. నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు రావని అధికారులు స్పష్టం చేస్తున్నారు. FTL పరిధిలో లేఅవుట్లు వేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

ఇంకా చదవండి:  తిరుపతి సభకు తెలంగాణ సీఎం...!!

 

ఇలా గుర్తించాలి..

జలవనరుల FTL పరిధులు రెవెన్యూ, నీటి పారుదల శాఖల వద్ద నమోదయి ఉంటాయి. చెరువు పూర్తిగా నిండినప్పుడు ఎక్కడి వరకు నీళ్లు వస్తాయనే అంచనాతో వీటిని రూపొందిస్తుంటారు. కాలానుగుణంగా చాలా చెరువులు, గతంలో వాటికి నీటిని చేరవేసే నాలాలు రూపు కోల్పోయాయి. అయినా బఫర్‌జోన్‌లో ఉన్నట్లే. ఇక్కడ ఎవరైనా ప్లాట్లు విక్రయిస్తుంటే కొనే ముందు పూర్తి స్థాయిలో పరిశీలించాలి. సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.

 

ఇంకా చదవండి:  అనంత లోకాలకు మార్గాలు... అనకాపల్లి రహదారులు! - నారా లోకేష్

 

HMDA పరిధిలోని 7 జిల్లాలో వేల చెరువుల్ని గుర్తించారు. వీటిల్లో కబ్జా, ఆక్రమణలు జరిగాయి. వీటి FTLను మ్యాపింగ్ చేస్తున్న హెచ్ఎండీఏ భవిష్యత్తులో ఇక్కడ నిర్మాణాల్ని కూల్చివేసే అవకాశం ఉంది.

 

ఇంకా చదవండి:  గన్నవరం విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్ కు అంతరాయం!!

 

సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో భవిష్యత్తులో భూముల ధరలు పెరుగుతాయని గ్రహించి చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. LRS తో క్రమబద్ధీకరించుకోవచ్చని భావిస్తుంటారు. అందుకే చెరువు శిభం, ftl లో ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దు. వీటిని ఎల్ఆర్ఎస్‌కు అనుమతించరు. దీంతో పెట్టుబడి డబ్బులు రాకపోవడంతో పాటు తర్వాత ఇబ్బందులు కూడా ఎదురవుతాయి.

 

ఇంకా చదవండి:  ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘం!! వైరల్ గా ఫేక్ న్యూస్!!

 

వెంచర్లకు సమీపంలో చెరువు లేదా ఇతర నీటి ఆనవాళ్లు ఉంటే తప్పకుండా అనుమానించాలి. సర్వే నంబర్ ఆధారంగా HMDA వద్ద ftl మ్యాపింగ్ పరిశీలించాలి. దీంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు.

 

ఇంకా చదవండి:  విమానయాన సంస్థలకు BCAS కీలక ఆదేశాలు!! ప్రయాణికుల విమర్శలే కారణం!!

 

చెరువుల FTL ప్రాంతాల్లో చాలా మందికి పట్టా భూములున్నాయి. ఇక్కడ వ్యవసాయం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో భూముల రేట్లు పెరగడంతో.. ఇవి వెంచర్లుగా మారుతున్నాయి. ఫ్లాట్స్, షెడ్స్ నిర్మించి విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసే ముందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఇక్కడ కొనకపోవడమే మంచిది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై విమర్శలు గుప్పించిన సతీశ్! బాపట్లను అభివృద్ధి చేసింది మేమే అని మాయమాటలు!

 

తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది! వయోపరిమితి పెంపు ఎందుకు ఆలస్యం చూడండి!

 

దాదాపు 1,650 మందికి ప్రత్యక్షంగా ఉపాధి! కర్ణాటకలో టాటా గ్రూప్ భారీగా పెట్టుబడులు!

 

అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో భారత్ ర్యాంకు! పాస్ పోర్టుతో 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం!

 

ఫీజు రీయింబర్స్ పేరుతో విద్యార్థులను మోసం!! సంక్షేమ పథకాలు మొదలుపెట్టిందే టీడీపీ!!- నారా లోకేష్

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Hyderabad #RealEstate #HyderabadPlaces #HyderabadRealEstate #HMDA #DTCP #FTL #LRS