బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!
Fri Dec 13, 2024 17:47 Environmentబంగాళాఖాతంలో కొన్ని రోజుల కిందట ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడింది. ఇదిలా ఉంటే, బంగాళాఖాతంలో ఎల్లుండి (డిసెంబరు 15) మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా రేపటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని, ఇది ఎల్లుండికి అల్పపీడనంగా బలపడుతుందని వివరించింది. ఇది అల్పపీడనంగా మారాక, తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరానికి చేరువగా వస్తుందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 16న నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 17న కోస్తా, రాయలసీమలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో, రైతులు వ్యవసాయ పనుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది.
ఇంకా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!
దివ్వెల మాధురికి లైవ్ లో ప్రపోజ్ చేసిన దువ్వాడ! ప్రేమా.? తెగింపా.? తెర వెనుక..
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి రాజీనామా చేసిన గంటల్లోనే మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా!
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?
మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..
ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మనోజ్! ఏడు నెలల కూతురును కూడా!
వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss
నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.