ఏపీకి తుఫాన్ హెచ్చరికలు.. ఈ రెండు రోజులు కుండపోత! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

Header Banner

ఏపీకి తుఫాన్ హెచ్చరికలు.. ఈ రెండు రోజులు కుండపోత! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

  Sat Dec 14, 2024 09:00        Environment

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వచ్చే 13 గంటల్లో బలహీనపడుతుందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో గడిచిన రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిశాయని తెలుపుతున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో ఈనెల దక్షిణ కోస్తా, రాయలసీమలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతున్నారు. గడిచిన రెండు రోజుల్లో తిరుపతి, చిత్తూరులో అధిక వర్షపాతం నమోదయిందని తెలుపుతున్నారు. రాగల రెండు రోజుల్లో కూడా దక్షిణ కోస్తా, రాయలసీమలోనే వర్షాలు పడతాయని అంటున్నారు.

 

ఇంకా చదవండి: టాలీవుడ్‌కు షాక్.. పరారీలో మంచు మోహన్‌బాబు! గాలిస్తున్న పోలీసులు..!

 

ఉత్తరాంధ్రలో అల్పపీడనం ప్రారంభం నుండి కూడా తక్కువ ప్రభావం ఉందని అంటున్నారు. గడిచిన రెండు రోజుల్లో కూడా అక్కడక్కడ చిన్నపాటి వర్షపాతం నమోదయిందని అంటున్నారు. రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలుపుతున్నారు. అల్పపీడన ప్రభావం అధికంగా లేకపోవడంతో రాష్ట్రంలో పోర్టులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదని తెలుపుతున్నారు. మత్స్యకారులకు కూడా చేపల వేటకు వెళ్లవద్దని ఎటువంటి హెచ్చరికలు జారీ లేవని అంటున్నారు. ఉత్తరాంధ్రలో అధిక శాతం వరి వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ తుఫాను ప్రభావం ఉత్తరాంధ్రపై తక్కువగా ఉంటుందని శుభవార్త చెప్పారు. వ్యవసాయ పనులు చేసుకునే వారికి ఎటువంటి ఆటంకం ఉండదని అంటున్నారు. మరో ఐదు రోజుల వరకు ఉత్తరాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని తెలుపుతున్నారు. డిసెంబర్ 18, 19 తేదీల్లో మరో తుఫాను వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆయా తేదీల్లో తుఫాను గురించి ముందుగా హెచ్చరికలు జారీ చేస్తామని అంటున్నారు. వ్యవసాయ పనులు ఏమైనా ఉంటే నాలుగైదు రోజుల్లో చూసుకోవాలని అంటున్నారు.

 

ఇంకా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

 

వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!

 

18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!

 

మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather