తిరుమలలో భక్తులు ఈ రూల్స్ పాటించాల్సిందే! HMPV వైరస్‌పై టీటీడీ కీలక ప్రకటన!

Header Banner

తిరుమలలో భక్తులు ఈ రూల్స్ పాటించాల్సిందే! HMPV వైరస్‌పై టీటీడీ కీలక ప్రకటన!

  Tue Jan 07, 2025 14:59        Devotional

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఈనెల 10న వైకుంఠ ఏకాదశి రోజు వేకువాజాము నుంచి వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తుల్ని అనుమిస్తారు. ఈ మేరకు మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వారం గుండా భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తులకు టీటీడీ ఈవో శ్యామలరావు కీలక సూచనలు చేశారు. 

 

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ ఈవో జే శ్యామలరావు భక్తులకు కీలక సూచనలు చేశారు. జనవరి 10వ తేదీ నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తామని.. జనవరి 10వ తేదీ వేకువజామున 4:30 కి ప్రోటోకాల్.. 8 గంటలకు సర్వ దర్శనం ప్రారంభమవుతందని చెప్పారు. జనవరి 10వ తేదీ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథం పై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి అభయమిస్తారన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామి దర్శనమిస్తారని.. జనవరి 11వ తేదీ ఉదయం స్వామి వారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారన్నారు.

 

తిరుపతి, తిరుమలలో 94 కౌంటర్ల ద్వారా టైం స్లాట్ టోకెన్స్ జారీ చేస్తున్న విషయాన్ని ఈవో గుర్తు చేశారు. జనవరి 9వ తేదీ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశికి సంబంధించి 1 లక్ష 20 వేల టికెట్స్ జారీ చేస్తామన్నారు. భక్తులు వారికి కేటాయించిన సమయానికి క్యూలైన్ వద్దకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. టోకెన్స్, టికెట్స్ ఉన్న భక్తులకే శ్రీవారి దర్శనం ఉంటుందని.. ఈ పది రోజుల (జనవరి 9 నుంచి జనవరి 19 వరకు) పాటూ సిఫార్సు లేఖలు, అన్ని రకాల దర్శనాలు రద్దు చేశామన్నారు. భక్తుల రద్దీని గమనించి.. తిరుమలలో భారీ స్థాయిలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. టిక్కెట్లపై ఎంట్రీ పాయింట్, పార్కింగ్ పాయింట్స్ సంబంధించిన వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. టోకెన్స్ లేని భక్తులకు దర్శనం ఉండదని.. తిరుమలకు అనుమతిస్తామన్నారు. దాదాపు 4 లక్షల 32 వేల ఎస్ఎస్డీ టోకెన్స్ జారీ చేస్తున్నామని.. హెచ్ఏంపీవీ వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. మార్గదర్శకాలు వస్తే వాటిని అమలు చేస్తామని తెలిపారు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో.. 3వేల మంది పోలీసులు, 1500 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈవో శ్యామలరావు. విద్యుత్, పుష్పాలంకరణతో తిరుమలను సుందరంగా ముస్తాబు చేస్తున్నామని.. ప్రయాగ్ రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళ జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాల్గొంటుందని.. హిందూ ధర్మప్రచార పరిషత్‌లో భాగంగా నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని కోసం 2.5 ఎకరాల భూమిని టీటీడీకి కేటాయించారని.. అక్కడ నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అక్కడ తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఉత్తరాది భక్తులకు స్వామి వారి అర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తామని.. కుంభమేళలో 4సార్లు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు. 

 

తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎలాంటి తోపులాట లేకుండా క్యూలైన్ సిస్టం ఏర్పాటు చేస్తున్నామని.. తిరుమలకు వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. వీఐపీలు దర్శనానికి వెళ్లే సమయం నుంచి వాహనానికి చేరుకొనే వరకు అన్ని టికెట్లలో ముద్రించి ఇస్తున్నామన్నారు. ఆ నిబంధనలకు అనుగుణంగా వీఐపీలు నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. మొత్తం 3 వేల మంది పోలీస్ సిబ్బంది భద్రత ఏర్పాట్లు చేశామని.. ఈ నెల 9వ తేదీన ఉదయం 5 గంటలకు టోకెన్స్ టీటీడీ జారీ చేస్తుందన్నారు. రాంభగీచా వద్ద రెండు అలైటింగ్ పాయింట్స్, ఏటీసీ వద్ద మూడు పాయింట్స్ ఉన్నాయన్నారు.

 

భక్తులు దర్శనం స్లాట్స్ ప్రకారం తిరుమలకు రావాలని.. ప్రతి ఒక్కరు రిపోర్టింగ్ సమయానికి చేరుకోవాలన్నారు టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. ఇచ్చిన సమయానికి వస్తే తోపులాటలు జరగవని.. రాంభగీచా అలైటింగ్ పాయింట్స్ దగ్గరకు వచ్చిన వారికి బస్ స్టాండ్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి టీటీడీకి సహకరించాలని.. వైకుంఠ ద్వార దర్శనం సమయానికి క్యూ లైన్ల దగ్గరకు రావాలని టీటీడీ కోరుతోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు! 

 

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో! 

 

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం! 

 

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం! 

 

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్! 

 

అమెరికా హెచ్ బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Devotional #Tirumala #TTD #Tirupati