ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా!

Header Banner

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా!

  Thu Jul 04, 2024 17:51        U S A

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో విదేశాలకు వెళ్తున్న టీచర్లకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సర్టిఫికెట్లు పంపిణీ

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి
శిక్షణ ఇచ్చి.. అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్లాట్ ఫార్మ్
నేడు శిక్షణ తీసుకుని విదేశాలకు వెళ్తున్న పలువురు టీచర్లు
వారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా సర్టిఫికేట్లు పంపిణీ

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 2022 నుండి ఒక ప్రత్యేక ఫ్లాట్ ఫార్మ్ ను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్. నేడు టీడీపీ ఆధ్వర్యంలో శిక్షణ పొంది విదేశాలలో ఉద్యోగాలకు వెళ్తున్న 16 మంది టీచర్లకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా 21 మంది ఐటీఐ ఎలెక్ట్రికల్ లో ట్రైనింగ్ పొందిన వారికి గల్ఫ్ లో ఉద్యోగాలు, మరో 31 మంది హోటల్ మేనేజ్ మెంట్ చేసిన వారిని అమెరికా లో ఇంటర్న్షిప్ కి పంపించడం జరిగింది. ఇదే కార్యక్రమంలో 3 నెలల జావా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 45 మంది విద్యార్ధులకు మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు సర్టిఫికేట్ లు అందించడం జరిగింది.

 

ఇంకా చదవండి: టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూడేళ్ల క్రితం నాటి దాడి కేసులో నిందితుల అరెస్టు! వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ప్రధాన సూత్రదారి!

 

కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, యువతకు ఉపాధి కల్పించడానికి ఒక ప్రత్యేక ప్లాట్ ఫార్మ్ ను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం గొప్పవిషయమని ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్ ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. నేడు శిక్షణ తీసుకుని విదేశాలకు వెళ్తున్న టీచర్లను ఆయన అభినందించారు. విదేశాలకు వెళ్తున్న టీచర్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గొప్ప స్థాయికి వెళ్లాలని సూచించారు. మాతృభూమికి మేలు చేయాలని కోరారు. విదేశాలకు వెళ్లిన ఉద్యోగులు ఇక్కడ యువతను ప్రోత్సహించాలని కోరారు. విదేశాలకు వెళ్తున్న టీచర్లు గురువులకు ఉన్న గౌరవాన్ని నిలబెట్టాలన్నారు. భువనేశ్వర్ లో లాగే వరల్డ్ స్కిల్ సెంటర్ ల ఏర్పాటుకు కృషి చేసి ఏపీలో యువతకు స్కిల్ ను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పనకు కృషి చేస్తానని తెలియజేశారు. స్కిల్ ఉన్న యువతకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విదేశాలకు వెళ్తున్న టీచర్లు అక్కడివారు మనకంటే ఎక్కువ మనం వారి కంటే తక్కువ అనే ఆలోచన లేకుండా అందరూ మానవులేనని మానవత్వంతో మెలగాలని సూచించారు. మంచి విషయాలను నేర్చుకుని గొప్ప స్థాయిలో సొంత దేశానికి తిరిగి రావాలని ఆకాంక్షించారు.

 

ఇంకా చదవండి: ఏపీకి పారిశ్రామిక రాయితీలు! రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు! రోడ్లు, పోలవరానికి ప్రత్యేక నిధులు! నేడే చంద్రబాబు ఢిల్లీ టూర్! 

 

ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ, యువతలో మంచి స్కిల్ ఉంటే ఎక్కడైనా ఉద్యోగాలు వస్తాయని అందుకే యువతకు స్కిల్ ను అందించేందుకు టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాక్రమానికి శ్రీకారం చుట్టి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. స్కిల్ ఉన్న యువతకు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వారిలో స్కిల్ ను పెంచేందుకు ప్రభుత్వం కూడా ఇక నుండి సహకరిస్తోందన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో శిక్షణ పొంది విదేశాలకు వెళ్లిన ఉద్యోగులు సక్సెస్ ఫుల్ గా వారి ఉద్యోగాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. నేడు విదేశాలకు వెళ్తున్న ఉద్యోగులకు అక్కడ టెక్ట్రా ఐటీ సర్వీసేస్ సీఈఓ మేకా శ్రీకాంత్ వారికి సపోర్ట్ చేస్తారని వారికి టెంపరరీ అకామిడేషన్ కల్పిస్తారని తెలిపారు. అక్కడికి వెళ్లాక అందరితో ఫ్రెండ్లీగా ఉండాలని అమెరికా కల్చర్ ను కూడా గౌరవించాలని సూచించారు. అక్కడి విద్యార్థులతో టీచర్ గా కాకుండా ఫ్రెండ్ గా ఉండి గురువుగా గొప్ప ఖ్యాతిని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అక్క్లెయిమ్ గ్లోబల్ ఎడ్యూకేషన్ కంట్రీ హెడ్ షేక్ జిలాని బాషా మరియు అమెరికాలో కంపెనీలు నిర్వహిస్తున్న శ్రీకాంత్ మేకతో పాటు ఎన్నారై టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ స్టాఫ్ విద్యార్ధిని విద్యార్ధులు, మరియు అమెరికా వవేలతున్న టీచర్ ల బంధు మిత్రులు పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమానికి సంబందించిన ఫోటోలను డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇవి కూడా చదవండి

బస్తాలకొద్దీ గత ప్రభుత్వ ఫైళ్ల దహనం! ఇద్దరు నిందితులు అరెస్ట్! వెలుగులోకి కీలక నేత పేరు!

 

ఏంటి ఇది నిజమేనా! రిషి సునాక్ కు ఈ సారి ఓటమి తప్పదా! ఎంతో ఆసక్తికరంగా యూకే ఎన్నికలు!

 

సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా! కారణం ఆదేనా!

 

నెలలో మూడు రోజులు కేటాయిస్తాను... ఉప్పాడలో క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం! ఏంటో చూసేయండి!

 

రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు! ఆ పదకం మళ్ళీ అమలు! 

 

ఏపీలో నిరుద్యోగులకు బిగ్ అలర్ట్! గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా!

 

పార్లమెంటు కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు! తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట! 

 

అమరావతిలో జగన్ రెడ్డి విధ్వంసాన్ని వివరించిన చంద్రబాబు! శ్వేత పత్రం విడుదల!

 

నీట్ పరీక్షపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు! ఆ పని చెయ్యండని సలహా!

 

అమరావతిలో జగన్ సర్కార్ చేసిన ఘనకార్యాలు అన్నీ ప్రజల ముందుకు! రాజధానిపై శ్వేతపత్రం విడుదల!

 

అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు! 

 

శ్రీవారి అన్నప్రసాదం తయారీపై టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఫిర్యాదులు పరిగణనలోకి! 

                                                                                    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AmdhraPravasi #NRITDP #USA #Teachers #TeacherTraining #BEDTeachers #TDP #India #AndhraPradesh