ఆ విషయం ట్రూడోకు ముందే తెలుసు.. అందుకే రాజీనామా! ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

Header Banner

ఆ విషయం ట్రూడోకు ముందే తెలుసు.. అందుకే రాజీనామా! ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

  Tue Jan 07, 2025 11:02        U S A

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో  తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడా  51వ రాష్ట్రంగా చేరాలనే ప్రతిపాదనను ఆయన పునరుద్ఘాటించారు. ఈమేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు.


ఇంకా చదవండిప్రపంచంలోని టాప్ 10 చిన్న అంతర్జాతీయ విమాన మార్గాలు! అన్నీ 100 కిలోమీటర్ల లోపే!


'అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండటం కెనడాలో చాలామంది ప్రజలకు ఇష్టమే. కెనడాకు అధికంగా రాయితీలు ఇచ్చి మా దేశం ఎక్కువ కాలం నష్టపోవాల్సిన అవసరం లేదు. ఆ దేశ ప్రధాని ట్రూడోకు ఈ విషయం తెలుసు కాబట్టే రాజీనామా చేశారు. అమెరికాలో భాగమైతే సుంకాలు ఉండవు, పన్నులు తగ్గుతాయి. అంతేకాక రష్యా, చైనాలకు చెందిన షిప్ల నుంచి ఎలాంటి ముప్పు ఉండదు' అని ట్రంప్ రాసుకొచ్చారు. ఇటీవల కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అనంతరం కెనడా ప్రధాని ట్రూడో .. ట్రంప్ తో భేటీ అయ్యారు. వలసలు, డ్రగ్స్ అక్రమరవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేనిపక్షంలో సుంకాలు పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాక, ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు చురకలంటించారు. ఈక్రమంలో 'గవర్నర్ ఆఫ్ కెనడా' అంటూ ట్రూడోను వ్యంగ్యంగా సంబోధించారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!



మరోవైపు.. ట్రూడో తన ప్రధాని పదవికి త్వరలో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు తెలిపారు. తన వారసుడిని పార్టీ ఎంపిక చేసేవరకూ ప్రధాని పదవిలో కొనసాగుతానని స్పష్టీకరించారు. పార్టీ పదవితో పాటు ప్రధాని బాధ్యతలు మార్క్ కార్నీ, లీ బ్లాంక్లో ఒకరు చేపట్టనున్నట్లు సమాచారం. హష్ మనీ కేసులో తీర్పు వాయిదా కుదరదు పోర్న్ స్టార్కు హష్ మనీ వ్యవహారంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే జనవరి 10న శిక్ష విధిస్తానని న్యూయార్క్ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కేసు తీర్పును వాయిదా వేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. అయితే, ఆ అభ్యర్ధనను న్యాయమూర్తి తిరస్కరించారు. ట్రంప్ నకు జనవరి 10న శిక్ష విధిస్తానని న్యూయర్క్ జడ్జి జువాన్ ఎం మెర్కాన్ ఇప్పటికే పేర్కొన్నారు. అయితే, ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేకుండా.. 'బేషరతు డిశ్ఛార్జి'ని అమలుచేస్తానని వెల్లడించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!


విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!


ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!


అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!


నేడు (
6/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


ప్రయాణికులకు శుభవార్త: మరో రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్.. ఈ ప్రాంతాలన్నింటికీ కొత్త రైల్వేస్టేషన్లు..


AP: 
రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన మహిళలకు అదిరే గుడ్ న్యూస్! కీలక ప్రకటన - ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు!


ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 
నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..


అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..


పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!


ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!


ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #america #trump #todaynews