వామ్మో ఆడ పిల్లనా! దారికి అడ్డంగా ఆటో పెట్టాడని రక్తం వచ్చేలా కొట్టిన యువతి! నెట్టింట వైరల్‌గా మారిన వీడియో!

Header Banner

వామ్మో ఆడ పిల్లనా! దారికి అడ్డంగా ఆటో పెట్టాడని రక్తం వచ్చేలా కొట్టిన యువతి! నెట్టింట వైరల్‌గా మారిన వీడియో!

  Sat Jul 06, 2024 11:30        India, Others

ఢిల్లీ వీధుల్లో ఓ యువతి ఉన్మాదిలా మారి రెచ్చిపోయింది. ఓ ఆటోవాలాను పబ్లిక్‌గా హాకీ కర్రతో తలపై రక్తమోడేలా బాదింది. ఈ భయానక ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లకు ఆగ్రహావేశాలు తెప్పిస్తున్నాయి. నిహాల్ విహార ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వైరల్ వీడియోలోని క్యాప్షన్ ప్రకారం, స్కూలు పిల్లలను తీసుకుని వెళుతున్న ఓ ఆటోవాలా ట్రాఫిక్ జాం కావడంతో ఆగిపోయాడు. అతడి వెనకే బుల్లెట్ బండిపై వస్తున్న యువతి తప్పుకోమని ఆటోవాలకు సూచిస్తూ పలుమార్లు హారన్ మోగించింది.

 

ఇంకా చదవండి: వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే! కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్!

 

అయితే, ఆటోవాలా తప్పుకోకపోవడంతో యువతి ఒక్కసారిగా సైకోలా మారి ఆటోవాలాను తన హాకీ కర్రతో ఇష్టారీతిన కొట్టింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ తలకు బలమైన గాయం కావడంతో రక్తం ధారాపాతంగా కారింది. ఆటోవాలాను కాపాడేందుకు స్థానికులు రంగంలోకి దిగారు. యువతిని అడ్డుకున్నారు. ఈ వీడియో నెట్టింట కూడా సంచలనంగా మారింది. యువతి ఉన్మాదాన్ని చూసి నెటిజన్లు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఇలాంటి వారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కాలంలో కూడా ఇలా గూండాగిరి చేసేవారిని అస్సలు ఉపేక్షించకూడదని అన్నారు. వీడియోను రీట్వీట్ చేస్తూ ఢిల్లీ పోలీసులను కూడా ట్యాగ్ చేశారు.

 

ఇంకా చదవండి: జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం!

 

ఎంపీగా అందుకున్న మొదటి నెల జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు! ఎంతో తెలుసా?

 

7న హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన సన్మానం! ఎందుకో తెలుసా?

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా!

 

కువైట్ లోని గృహ కార్మికులకు శుభవార్త! ఆనందంలో ప్రవాసులు!

 

ఆస్ట్రేలియా పార్లమెంట్ పైకప్పుపై నిరసన! అనుకూల మద్దతుదారులు అరెస్ట్!

 

WhatsAppలో కొత్త ఫీచర్! మీ ఫోటో నుండి AI అవతార్ ని ఇలా సృష్టించండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #NewDelhi #CrimeNews #ViralVideos #GirlBeatsupAutowala