రాష్ట్రానికి మరో 9 ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!

Header Banner

రాష్ట్రానికి మరో 9 ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!

  Mon Dec 30, 2024 19:26        Politics

రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్దఎత్తున వస్తున్న సంస్థలకు భూకేటాయింపులతో సహా మౌలిక వసతులను శరవేగంగా కల్పించాలని, అదేవిధంగా ఒప్పందం ప్రకారం నిర్ధిష్ట సమయంలోనే ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో రాష్ట్రంలో వివిధ సంస్థలు ఏర్పాటు చేయదలిచిన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. మొత్తం 9 ప్రాజెక్టులు రాష్ట్రానికి కొత్తగా వస్తున్నాయని, వీటి ద్వారా రూ. 1,82,162 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు రూ. 2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

 

బీపీసీఎల్‌తో సహా ప్రతిష్టాత్మక సంస్థల రాక :

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటు చేయనుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీంతో 2,400 మందికి ఉపాధి కలుగనుందని చెప్పారు. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్ధ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మిస్తారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రూ. 88,747 కోట్ల ఆదాయం రానుందని తెలిపారు. అయితే 2029లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.

 

టీసీఎస్ :

విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ. 80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.

 

ఇంకా చదవండి: జగన్ అండదండలతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి! డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ!

 

ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ :

శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో వచ్చే ఆరేళ్లలో పూర్తయ్యేలా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఈ సంస్థ రూ. 1,046 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 2,381 మందికి ఉపాధి కలుగుతుంది.

 

బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ :

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో రూ.1,174 కోట్లతో 1,500 మందికి ఉపాధి కలిగేలా బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీఎఫ్/పర్టికల్ బోర్డు ప్లాంట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పనుంది.

 

క్లిక్ అయిన క్లీన్ ఎనర్జీ పాలసీ :

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన క్లీన్ ఎనర్జీ పాలసీతో పలు సంస్థలు భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తున్నాయి. కొత్తగా ఐదు సంస్థలు రూ. 83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నాయి. దీంతో కేవలం క్లీన్ ఎనర్జీ రంగంలోనే రెండున్నల లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి.

 

ఏఎం గ్రీన్ అమ్మోనియా(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ :

ఏఎం గ్రీన్ అమ్మోనియా(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో 592 ఎకరాల్లో 1 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అమ్మోనియా మాన్యుఫాక్చరింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. రూ. 12,000 కోట్ల పెట్టుబడితో 2,600 మందికి ఉపాధి కలుగుతుంది.

 

జాన్ కోకిరిల్ గ్రీన్‌కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ :

జాన్ కోకిరిల్ గ్రీన్‌కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో 40 ఎకరాల్లో 2 గిగావాట్ల సామర్ధ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ను రూ. 2,000 వేల కోట్లతో స్థాపించనుంది. దీంతో 500 మందికి ఉపాధి కలుగుతుంది. 

 

టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ :

400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ కర్నూలు జిల్లాలోని హోసూరు, పెద్ద హుల్తిలో 1,800 ఎకరాల్లో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 1,380 మందికి ఉపాధి కలుగుతుంది.

 

క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ :

వైఎస్సాఆర్ జిల్లాలోని మైలవరం, కొండాపురం అలాగే నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో మొత్తం 1,080 ఎకరాల్లో 119 మెగావాట్ల విండ్ పవర్, 130 మెగావాట్ల సోలార్ హైబ్రీడ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 2,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. 650 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి.

 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ :

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రాష్ట్రంలో తాజాగా 65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రమంతటా 5 లక్షల ఎకరాల్లో  రెండున్నర లక్షల మందికి ఉపాధి కలిగేలా 11 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం 2028 కల్లా పూర్తి కానుంది. దీని ద్వారా రాష్ట్రానికి రూ. 4,095 కోట్ల ఆదాయం రానుంది. నవంబర్ 19న జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

31/12 నుంచి 11/01 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మటన్ ఎలా పడితే అలా తినకండి! కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం!

 

చంద్రబాబు మంచితనమే మీరంతా ఐదు నెలలకే రోడ్లపైకి! వైకాపా వ్యాఖ్యలపై ఘాటైన హెచ్చరిక!

 

87 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. చ‌రిత్ర సృష్టించిన‌ భార‌త్‌, ఆసీస్ బాక్సింగ్ డే మ్యాచ్‌! ఐదు రోజుల్లో..

 

ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరణ! విద్యా రంగంలో కొత్త దశ!

 

నేడు (30/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మెడ నొప్పితో పాటు ఈ లక్షణాలు.. స్ట్రోక్‌కి సంకేతం కావచ్చు, తస్మా జాగ్రత్త!

 

గుడ్ న్యూస్.. ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి కీలక ప్రకటన! వేలల్లో ఉద్యోగావకాశాలు!

 

 ఏపీలో పెట్రేగిపోతున్న ట్రోలింగ్.. బొత్స కాళ్లు నేనెందుకు పట్టుకుంటాను? క్లారిటీ ఇచ్చిన మంత్రి!

 

అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!

 

వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్, డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

 

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

 

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews