స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు! వాటిపై ప్రధాన దృష్టి!

Header Banner

స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు! వాటిపై ప్రధాన దృష్టి!

  Tue Jan 07, 2025 17:32        Politics

విశాఖలో ప్రధాని సభా వేదిక ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం మంచి ప్యాకేజీ కేంద్రం ప్రకటిస్తుందని తెలిపారు. ఉక్కు ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులో ఇబ్బందులు ఉన్నాయన్న విషయం కేంద్రమంత్రి దృష్టికి తీసుకుని వెళతామని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల జరిగే అభివృద్ధి నమూనాకు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ అని పురందేశ్వరి తెలిపారు. స్టీల్ ప్లాంట్కు త్వరలో కేంద్ర ఉక్కు మంత్రి కుమార స్వామి రివైవల్ ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.. రూ.17 వేల కోట్లు రివైవల్ ప్యాకేజీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరంకు రూ.12500, టాక్స్ డివల్యూషన్ కింద 7200, పంచాయతీ రాజ్ శాఖకు 4800 MNREGS పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి కేంద్రం సహకరించిందని పురందేశ్వరి తెలిపారు.


ఇంకా చదవండిప్రపంచంలోని టాప్ 10 చిన్న అంతర్జాతీయ విమాన మార్గాలు! అన్నీ 100 కిలోమీటర్ల లోపే!



రూ.6000 కోట్లతో జల్ జీవన్ మిషన్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. మరోవైపు.. మోడీ సభలకు జన సమీకరణ అవసరం లేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపు (బుధవారం) విశాఖకు వస్తున్నారు. పర్యటనలో భాగంగా.. ఎన్టీపీసీ ప్రాజెక్ట్, వైజాగ్ రైల్వే జోన్, జోనల్ హెడ్ క్వార్టర్ శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారు. అంతేకాకుండా.. కొన్ని పూర్తి అయిన ప్రాజెక్ట్లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు ప్రత్యేకంగా ప్రధాని టూర్ పై దృష్టి పెట్టారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా వైజాగ్ వెళ్లి మరీ సమీక్ష నిర్వహించారు. మరోవైపు.. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వైజాగ్లో రోడ్ షో నిర్వహించనున్నారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!


అన్ని రకాల వార్తల కోసం
  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!


విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!


ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!


అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!


నేడు (
6/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


ప్రయాణికులకు శుభవార్త: మరో రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్.. ఈ ప్రాంతాలన్నింటికీ కొత్త రైల్వేస్టేషన్లు..


AP: 
రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన మహిళలకు అదిరే గుడ్ న్యూస్! కీలక ప్రకటన - ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు!


ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 
నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..


అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..


పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!


ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!


ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #vizag #steelplant #doubleengine #railwayzone #todaynews #flashnews #latestupdate