మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే!

Header Banner

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే!

  Wed Jan 08, 2025 07:00        Politics

దేశంలోని పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో మ‌హిళ‌ల సాధికార‌త కోసం మరో కొత్త ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. అదే ఎల్ఐసీ బీమా సఖీ యోజన. ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.7 వేలు ఇవ్వనున్నారు. డిసెంబర్ 9 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్యానా పర్యటన సందర్భంగా ఈ స్కీం ప్రారంభించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా ఈ పథకాన్ని డిజైన్ చేశారు. స్కీం లో భాగంగా మహిళలను LIC ఏజెంట్లుగా చేర్చి వారికి నెలనెలా స్థిరమైన ఆదాయం వచ్చేలా చేస్తారు. బీమా సఖీ యోజన ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక సహాయం అందించడం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) భాగస్వామ్యంతో ఈ స్కీం షురూ చేస్తున్నట్లు పిఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 18 నుంచి 70 ఏళ్ల లోపు మహిళలు ఇందులో చేరవచ్చు.

 

ఇంకా చదవండి: వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

 

అయితే వారు తప్పనిసరిగా 10వ తరగతి పాసై ఉండాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) భాగస్వామ్యంతో ఈ స్కీం షురూ చేస్తున్నట్లు పిఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 18 నుంచి 70 ఏళ్ల లోపు మహిళలు ఇందులో చేరవచ్చు. అయితే వారు తప్పనిసరిగా 10వ తరగతి పాసై ఉండాలి. ఈ పథకం కింద, మహిళలకు ఆర్థిక అక్షరాస్యత, బీమా రంగంపై అవగాహన కల్పించడానికి మొదటి 3 సంవత్సరాలు ప్రత్యేక శిక్షణ, స్టైఫండ్ ఇస్తారు. శిక్షణ తర్వాత, మహిళలు ఎల్‌ఐసి ఏజెంట్లుగా పని చేయాలి. గ్రాడ్యుయేట్ బీమా సఖీలు కూడా ఎల్‌ఐసిలో డెవలప్‌మెంట్ ఆఫీసర్ పాత్రలో పనిచేసే అవకాశం పొందుతారు. ఈ పథకం ప్రారంభంలో మహిళలకు మొదటి ఏడాది ప్రతి నెలా రూ.7 వేలు అందజేస్తారు . రెండో ఏడాది రూ.6000, మూడో ఏడాది రూ.5000 ప్రతినెలా అందజేస్తారు. ఇలా మూడేళ్లలో రూ. 2 లక్షల కంటే ఎక్కువగా అందుకుంటారు.

 

ఇంకా చదవండి: కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన! వివిధ నిర్మాణాలకు శంకుస్థాపన.. టాటా సంస్థ సహకారంతో..

 

టార్గెట్ పూర్తి చేసిన భీమా సఖిలకు ప్రత్యేక కమీషన్ కూడా ఇవ్వబడుతుంది. ఈ పథకంలో మొదటి దశలో 35 వేల మంది మహిళలకు బీమా ఏజెంట్లుగా ఉపాధి కల్పించనున్నారు. తర్వాత మరో 50 వేల మంది మహిళలకు ఈ పథకం కింద ప్రయోజనాలు అందజేయనున్నారు. ఎలా దరఖాస్తు చేయాలంటే: ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ (https://licindia.in/test2)పై క్లిక్ చేయండి. ఆ తర్వాత క్లిక్ ఫర్ బీమా సఖి ఆప్షన్‌పై క్లిక్ చేసి.. ఇచ్చిన ఫారమ్‌లో మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలతో పూరించండి. చివరగా క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే సరిపోద్ది. మీరు పని చేయాలనుకుంటున్న బ్రాంచ్‌ని ఎంచుకోవడం ముఖ్యం. అదేవిధంగా ప్రతి బీమా సఖీ ఏడాదికి కనీసం 24 పాలసీలను అమ్మాలనే కండిషన్ ఉంది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత, మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

నేడు (7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Modi #AndhraPradesh #APPolitics #NaraLOkesh #Chandrababu #ModiMeeting #Anakapalli