పండగ వేళ మహిళలకు శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధర..

Header Banner

పండగ వేళ మహిళలకు శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధర..

  Tue Jan 07, 2025 10:55        Business

అంతర్జాతీయ పరిణామాలతో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతుంటాయి. ఓ సారి తగ్గితే, మరో సారి పెరుగతూ ఉంటాయి. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర కూడా తగ్గింది. మంగళవారం (7వ తేదీ) ఉదయం 7.30 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం (22 క్యారెట్స్) ధర రూ.72,140, 24 క్యారెట్స్ 78,700 లుగా ఉంది. వెండి కిలో ధర రూ. 98,900లుగా ఉంది. నిన్న (సోమవారం) ధరలతో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై పది రూపాయల మేర తగ్గింది. ఈ నెల 1వ తేదీన వెండి కిలో రూ.98వేలు ఉండగా, నేడు 98,900లకు చేరింది. బంగారం ఈ నెల 1వ తేదీన (22 క్యారెట్స్) 10 గ్రాములు రూ.71,500, (24 క్యారెట్స్) రూ.78,000లుగా ఉంది. ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తే .. హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ బంగారం ధర రూ.72,140లు, 24 క్యారెట్స్ ధర రూ.78,700లు, కిలో వెండి 98,900లుగా ఉంది. విజయవాడలో బంగారం ( 22 క్యారెట్స్) ధర రూ.72,140లు, 24 క్యారెట్స్ ధర రూ.78,700, వెండి కిలో ధర రూ.98,900గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఢిల్లీలో పది గ్రాముల బంగారం (22 క్యారెట్స్) ధర రూ.72,290 లు, 24 క్యారెట్స్ 78,850లు, వెండి కిలో ధర రూ.91,400లుగా ఉంది.     

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

నేడు (7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #GoldRate #Gold #Dubai #DubaiGoldRate #DubaiGoldBusiness #GoldRateLow #LessGoldRateInDubai #UAE #GoldBusiness #LowPriceGoldInDubai