రూ.12 లక్షల శాలరీ వస్తున్నా! రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఎలాగో తెలుసా?

Header Banner

రూ.12 లక్షల శాలరీ వస్తున్నా! రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఎలాగో తెలుసా?

  Tue Jan 07, 2025 13:45        Business

పరిమితికి మించి ఆదాయం ఉన్న వారు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండు రకాల పన్ను విధానాలు ఉన్నాయి. అయితే పాత పన్ను విధానం ఎంచుకుంటే కొన్ని మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. రూ.5 లక్షల లోపు ఉంటే ఎలాంటి ట్యాక్స్ ఉండదు. కానీ, మీ జీతం రూ.12 లక్షలు ఉన్నా రూపాయి ట్యాక్స్ పడకుండా చూసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

 

భారతీయ పౌరులు ఎవరైనా పరిమితికి మించి ఆదాయం పొందుతుంటే వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం పలు సెక్షన్ల ద్వారా కొన్ని మినహాయింపులు పొందవచ్చు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానం తీసుకొచ్చింది. ఇందులో ఎలాంటి మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. కానీ, పాత పన్ను విధానం ఎంచుకుంటే ట్యాక్స్ మినహాయింపులు ఉంటాయి. పన్ను ఆదా చేసుకోవాలని భావించే ఉద్యోగులు ఏడాది ప్రారంభం నుంచే ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉంటుంది. పాత పన్ను విధానంలో ట్యాక్స్ రిబేట్ ద్వారా రూ.5 లక్షల వరకు ఎలాంటి పన్ను కట్టక్కర్లేదని అందిరికీ తెలిసిందే. కానీ, రూ.5 లక్షలు దాటితే పన్ను పడుతుంది. అయినప్పటికీ రూ.12 లక్షల ఆదాయం ఉన్నా ఎలాంటి పన్నులు చెల్లించకుండా చూసుకోవచ్చు.

 

పన్ను మినహాయింపులు పొందేందుకు ఉద్యోగులు తమ వేతన స్ట్రక్చర్ మార్చుకోవాలి. శాలరీ రూపంలో ఎంత డబ్బు అందాలి, రియింబర్స్‌మెంట్ ఎంతుండాలి? అనేది ఏర్పాటు చేసుకోవాలి. రీయింబర్స్‌మెంట్‌లో లీవ్ ట్రావెల్ అలవెన్సులు, ఫుడ్ కూపన్లు, ఎంటర్టైన్మెంట్, ఇంటర్నెట్, ఫోన్ బిల్లులు, పెట్రోల్ బిల్లుల వంటివి ఉంటాయి. ఇవి పన్ను ఆదా చేయడంలో కీలకంగా మారతాయి. అలాగే పన్ను ఆదా చేసుకోవడంలో హౌస్ రెంట్ అలవెన్సు ఒక మార్గం. జీతంలో కంపెనీ అందించే హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయవచ్చు. మెట్రో నగరాల్లో ఉద్యోగం చేస్తుంటే బేసిక్ వేతనంలో 50 శాతం వరకు, నాన్ మెట్రో నగరాల్లో అయితే జీతంలో 40 శాతం వరకు హెచ్ఆర్ఏ మినహాయింపు పొందవచ్చు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వార్షిక వేతనం రూ.12 లక్షలుగా ఉందని అనుకుందాం. అప్పుడు మీ హెచ్ఆర్ఏ 3.60 లక్షలు, లీవ్ ట్రావెల్ అలవెన్స్ రూ.10 వేలు, ఫోన్ బిల్లు రూ.6 వేలుగా మీ శాలరీ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పన్ను పరిధిలోకి వచ్చే వేతనం తగ్గుతుంది. వీటితో పాటుగా మీరు సెక్షన్ 16 కింద స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలు పొందుతారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ మినహాయింపు రూ.2500 వరకు లభిస్తుంది. సెక్షన్ 10(13ఏ) కింద హెచ్ఆర్ఏ రూ.3.60 లక్షలు, సెక్షన్ 10(5) ద్వారా ఎల్టీఏ రూ.10 వేలు ఇవన్ని క్లెయిమ్ చేస్తే పన్ను పరిధిలోకి వచ్చే వేతనం రూ.7.71 లక్షలకు తగ్గుతుంది.

 

అందులోంచి సెక్షన్ 80సీ ద్వారా వివిధ పెట్టుబడులు అంటే పీపీఎఫ్, ఎల్ఐసీ ప్రీమియం, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి వాటి ద్వారా రూ.1.50 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీసీడీ ద్వారా నేషనల్ పెన్షన్ సిస్టమ్ టైర్-1 కింద రూ.50 వేలు క్లెయిమ్ చేయొచ్చు. సెక్షన్ 80డీ ద్వారా భార్యా పిల్లల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై రూ.25 వేలు, తల్లిదండ్రులకు హెల్త్ పాలసీలపై రూ.50 వేల వరకు మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇవన్నీ తీసేస్తే పన్ను పరిధిలోకి వచ్చే శాలరీ రూ.5 లక్షలకు వస్తుంది. పన్ను పరిధిలోకి వచ్చేరూ.5 లక్షల లోపు ఉన్నప్పుడు సెక్షన్ 87ఏ కింద రిబేట్ లభిస్తుంది. అంటే ట్యాక్స్ రూపాయి కూడా చెల్లించరు. మీ పన్ను సున్నా అవుతుంది. అయితే పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. అలాగే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఈ ప్లాన్ అప్లై చేయడం ద్వారా బెనిఫిట్ పొందవచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు! 

 

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో! 

 

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం! 

 

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం! 

 

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్! 

 

అమెరికా హెచ్ బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Business #Tax #IncomeTax