నిరుద్యోగులకు పండగ తెచ్చే బంపర్ ఆఫర్! రైల్వే శాఖ వేల గ్రూప్-డి పోస్టుల నోటిఫికేషన్ జారీ! సిలబస్, అర్హతల వివరాలు...!

Header Banner

నిరుద్యోగులకు పండగ తెచ్చే బంపర్ ఆఫర్! రైల్వే శాఖ వేల గ్రూప్-డి పోస్టుల నోటిఫికేషన్ జారీ! సిలబస్, అర్హతల వివరాలు...!

  Sun Dec 29, 2024 10:18        Employment

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో దాదాపు 32,438గ్రూప్-డి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన -జారీ చేసింది. ఈ మేరకు ఈ పోస్టులకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. దీనిలో సాయింట్స్మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ వంటి తదితర పోస్టులు ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు తుది గడువు ఫిబ్రవరి 22వ తేదీతో ముగుస్తుంది. అహ్మదాబాద్, అజ్ మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖుర్, కోల్కతా, మాల్డా, ముంబయి, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్.. ఆర్ఆర్బీ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!



పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి జులై 01, 2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, చివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.18,000 వరకు జీతంగా చెల్లిస్తారు. విభాగాల వారీగా పోస్టుల వివరాలు, అర్హతలు, సిలబస్, ఎంపిక విధానం వంటి తదితర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ జారీ తర్వాత తెలుసుకోవచ్చు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



ముఖ్యమైన తేదీలు...
• వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల తేదీ: జనవరి 23, 2025.
• ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 23, 2025.
• ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2025.



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్, డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

 

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

 

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటేకొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #railway #post #groupd #notification #todaynews #jobs #flashnews #latestupdate