మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు! వాతావరణ శాఖ అలర్ట్!

Header Banner

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు! వాతావరణ శాఖ అలర్ట్!

  Mon Jul 22, 2024 17:31        Environment

నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా విస్తరించడంతో పాటు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన అలర్ట్ ప్రకారం మరో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఉత్తర కోస్తా అంతటా..మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. దక్షిణ కోస్తా లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

భారీ వర్షాల కారణంగా.. తీరం ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. దీంతో సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగిసి పడే అవకాశం ఉందని.. మత్స్యకారులు రానున్న నాలుగు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికలను జారీ చేయగా.. కాళేశ్వరం వద్ద మొదటి సారి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటగంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో లంక గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అసెంబ్లీలో మంత్రి లోకేష్ తో ఆ పార్టీ ఎమ్మెల్యేల భేటీ! కారణం ఏంటంటే!

 

ఐదేళ్లు ఏం చేశారు? మాజీ సీఎం జగన్ కు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్!

 

నల్ల కండువాతో అసెంబ్లీ కి వచ్చిన జగన్! సభ నుంచి వైసీపీ వాక్ ఔట్!

 

గత ప్రభుత్వం చేసిన తప్పులపై గవర్నర్ ప్రసంగం! వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన!

 

వైసీపీకి షాక్! వైఎస్ జగన్ సమావేశానికి ఐదుగురు ఎంపీలు డుమ్మా!

 

పరామర్శకు వెళ్లి పథకాల గురించి మాట్లాడతారా? హోం మంత్రి తీవ్ర ఆగ్రహం!

          

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Environment #Rains #Storms #Nature #AndhraPradesh #WeatherAlert #RainAlert