అతి తక్కువ ధరలో 5జీ ఫోన్.. మతిపోగొట్టే ఫీచర్లతో విడుదల! ఆ వివరాలు మీకోసం.. Don't Miss!

Header Banner

అతి తక్కువ ధరలో 5జీ ఫోన్.. మతిపోగొట్టే ఫీచర్లతో విడుదల! ఆ వివరాలు మీకోసం.. Don't Miss!

  Wed Dec 25, 2024 08:30        Gadgets

లావా సంస్థ తమ సరికొత్త ‘లావా బ్లేజ్ డ్యూయో 5జీ’ ఫోన్ ను తాజాగా విడుదల చేసింది. మీడియం రేంజ్ ఫోన్లలో డ్యూయల్ స్క్రీన్ తో వస్తున్న ఫోన్లలో ఇది ఒకటి. దీనికి ముందువైపు ప్రధాన డిస్ ప్లేతోపాటు వెనుకవైపు కెమెరాల పక్కన చిన్న డిస్ ప్లేను ఇచ్చారు. కాల్స్, మేసేజీలు, సమయం ఇతర వివరాలను దాని నుంచి చూసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. ముందువైపు 6.67 అంగుళాల పెద్ద డిస్ ప్లే. ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో, త్రీడీ కర్వ్ డ్ అమోలెడ్ స్క్రీన్ ఇచ్చారు. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటును సపోర్ట్ చేస్తుంది. గేమ్స్ ఆడేవారికి ఇది బాగుంటుంది. వెనుకవైపు కెమెరాల పక్కన 1.58 అంగుళాల సెకండరీ డిస్ ప్లే ఇచ్చారు. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్ సెట్ ను.. అత్యాధునిక ఎల్పీడీడీఆర్ 5 ర్యామ్ ను ఇచ్చారు. అత్యంత వేగంగా డేటా ట్రాన్స్ ఫర్ ను సపోర్ట్ చేసే.. యూఎఫ్ఎస్ 3.1 సాంకేతికతతోకూడిన 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ ఉంది.

 

ఇంకా చదవండి: గోల్డ్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్! డిసెంబర్ నెలలో గోల్డ్ రేట్లు నేల చూపులు..

 

అయితే అదనంగా మెమెరీ కార్డు పెట్టుకునే సౌకర్యం కల్పించలేదు. ఇక కెమెరాల విషయానికి వస్తే... 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ కెమెరాతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరాను ఇచ్చారు. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ప్రధాన డిస్ ప్లే దిగువ భాగాన ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అమర్చారు. ఈ ఫోన్ 8.45 మిల్లీమీటర్ల మందంతో.. 186 గ్రాముల బరువు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ రెండు సిమ్ స్లాట్లు కూడా 4జీ, 5జీ రెండింటినీ సపోర్ట్ చేస్తాయి. చార్జింగ్ కోసం యూఎస్ బీ టైప్ సి పోర్ట్ ఇచ్చారు. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. 33 వాట్ల చార్జర్ తో వేగంగా చార్జ్ అవుతుంది. బ్లూటూత్ 5.2, గైరోస్కోప్, కంపాస్, లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, యాక్సిలరోమీటర్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ మోడల్ ధర రూ.18,999... 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ మోడల్ ధర 20,499గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ సెలెస్టియల్ బ్లూ, ఆర్కిటిక్ వైట్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. 

 

ఇంకా చదవండి: అమెరికాలో మరో ఘోర ప్రమాదం! ఊహించని విధంగా తెలుగు విద్యార్ధి మృతి! ఇలా కూడా జరుగుతుందా అనే రీతిలో! మరో ఇద్దరు క్షేమం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!

 

రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!

 

విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో జాబ్, అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

 

నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!

 

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #5Gphone #Tech-Newslava #Lavablazeduo5g