అది శంకర్ 'భారతీయుడు' .. మరి ఇది? పబ్లిక్ టాక్! నిన్ననే థియేటర్లలో విడుదలైన సినిమా!

Header Banner

అది శంకర్ 'భారతీయుడు' .. మరి ఇది? పబ్లిక్ టాక్! నిన్ననే థియేటర్లలో విడుదలైన సినిమా!

  Sat Jul 13, 2024 16:30        Entertainment

శంకర్.. సౌత్ సినిమా నిర్మాణంలో ఒక కీలకమైన మలుపును.. మార్పును తీసుకొచ్చిన దర్శకుడు. ఆయన ఎంచుకునే చాలా కథలు దేశభక్తి నేపథ్యంలోనే కొనసాగుతూ ఉంటాయి. అలా చాలా కాలం క్రితం ఆయన నుంచి వచ్చిన సినిమానే 'భారతీయుడు'. శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్ పై వచ్చిన ఆ  సినిమాలో కమల్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా, ఆయన భార్య పాత్రలో సుకన్య .. కూతురి పాత్రలో కస్తూరి నటించారు. ఇక మనీషా కొయిరాలా .. ఊర్మిళ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఆ సినిమా ఒక సంచలనం సృష్టించింది. ఆ సినిమాకి కమల్ మాత్రమే కాదు, ఏఆర్ రెహ్మాన్ కూడా ఒక హీరోనే అని చెప్పుకున్నారు. అంతగా ఆ పాటలు పాప్యులర్ అయ్యాయి. 'అవినీతికి అలవాటు పడితే కన్నకొడుకునైనా కలుపు మొక్కలా పీకేయవలసిందే' అనే భారతీయుడి కాన్సెప్ట్ చివరివరకూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అలాంటి ఒక కాన్సెప్ట్ ను హ్యాండిల్ చేసిన తీరు విషయంలో శంకర్ ను అభినందించనివారు లేరు.

 

ఇంకా చదవండి: వేరే వాళ్లనయితే చెప్పుతో కొట్టి ఉండేదాన్ని! జబర్దస్త్ రోహిణి సీనియర్ జర్నలిస్టుపై ఫైర్!

 

కానీ రీసెంటుగా 'భారతీయుడు 2' కోసం థియేటర్లకు వెళ్లినవారు  మాత్రం ఇది శంకర్ సినిమానేనా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కథా పరంగా చూసుకుంటే, భారతీయుడేమిటి? విదేశాలలో తలదాచుకోవడమేమిటి? అంటున్నారు. భారతీయుడి కాన్సెప్ట్ వలన నష్టపోయినవారెవరైనా ఉంటే, వాళ్ల కుటుంబాల వరకూ ఆయన పట్ల నిరసన తెలియజేయవచ్చు. కానీ దేశ ప్రజలంతా ఈ విషయంలో ఒకే తాటిపైకి రావడం ఏమిటనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారతీయుడు 'మర్మకళ' అనే ప్రాచీన యుద్ధవిద్యను ఉపయోగిస్తూ రౌడీ గ్యాంగ్ పై విరుచుకుపడితే, ఆ మర్మకళ ప్రభావమంటూ, వాళ్లంతా గుర్రంలా గెంతుతూ వెళ్లడం హాస్యాస్పందంగా ఉందని అంటున్నారు. అసలు ఇది శంకర్ సినిమానేనా? అంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

ఇంకా చదవండి: రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ సంస్థలకు బాధ్యతలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రైల్వే జిఎం అరుణ్ కుమార్ ని కలిసి పలు సమస్యలను వివరించిన ఎంపి శ్రీకృష్ణదేవరాయలు! పల్నాడులో ఆర్ ఓబీలు, ఆర్యుబిలు నిర్మాణ!

 

ఏపీ ఐఏఎస్ బదిలీలపై కీలకమైన మార్పులు ! 19 మంది కొత్త పాత్రల్లో !

 

వామ్మో.. వాయ్యో... ఏమిటి ఈ "వాట్స్ అప్" వినతుల వెల్లువ! తట్టుకో లేక పోతున్న సిబ్బంది! పర్సనల్ మెయిల్ ఐడీని ప్రకటించిన లోకేశ్!

 

ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!

 

46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుడి భాండాగారం! ఏకగ్రీవంగా తీర్మానించిన 16 మంది సభ్యుల కమిటీ!

 

ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #KamalHaasan #Siddharth #RakulPreetSingh #SJSurya