రామ్ చరణ్ కు మరో అంతర్జాతీయ గౌరవం! ఆస్ట్రేలియాలో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కు!

Header Banner

రామ్ చరణ్ కు మరో అంతర్జాతీయ గౌరవం! ఆస్ట్రేలియాలో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కు!

  Fri Jul 19, 2024 15:28        Entertainment

'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆస్ట్రేలియాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్... తమ 15వ ఎడిషన్ వేడుకలకు చరణ్ ను గౌరవ అతిథిగా ఆహ్వానించింది. ఈ సంస్థ ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా జరుపుతున్న వేడుకలకు చరణ్ ను ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ టీమ్ మాట్లాడుతూ... తమ 15వ ఎడిషన్ కార్యక్రమానికి చరణ్ హాజరు కానుండటం తమకు మరుపురాని అంశంగా మిగిలిపోతుందని తెలిపింది.

 

ఇంకా చదవండి: చివరిరోజు వరకూ సిల్క్ స్మిత క్రేజ్ తగ్గలేదు! ఒకప్పుడు హాట్ బ్యూటీ అనిపించుకున్న అనూజ!

 

వేడుకల్లో చరణ్ నటించిన ప్రముఖ చిత్రాలను కూడా ప్రదర్శించనున్నామని వెల్లడించింది. భారతీయ సినిమాకు చరణ్ చేసిన సేవలకు గాను... 'భారతీయ కళ మరియు సంస్కృతికి అంబాసిడర్' బిరుదును కూడా ప్రదానం చేయనున్నట్టు తెలిపింది. తనకు గౌరవ అతిథిగా ఆహ్వానం అందడంపై చరణ్ స్పందిస్తూ... ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో భాగం కావడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. మన చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తుండటం, ప్రపంచ వ్యాప్త సినీ ప్రముఖులు, అభిమానులతో కనెక్ట్ కావడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంత గుర్తింపు, ప్రేమ దక్కడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు.




ఇంకా చదవండి: మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కు బ్రేక్ వేసిన పోలీసులు! వారికి నో ఎంట్రీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లోకేశ్ చొరవతో కువైట్ నుంచి ఏపీకి చేరుకున్న శివ! ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ కన్నీటితో..

 

కొడాలి షాక్.. కోర్టును ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం! ఇక జైలుకేనా?

 

ఖతార్ లో ఎన్టీఆర్ 101 వ జయంతి ఘనంగా వేడుకలు! భారీగా హాజరైన అభిమానులు! ఒక సంక్షోభంలో తెలుగువారు ఎలా ఐక్యంగా ముందుకెళ్లాలో..

 

బాలిక అదృశ్యం ఘటనలో చర్యలు.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు!

 

విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు! సకాలంలో వైద్యసేవలు అందేలాజేసిన భువనేశ్వరి!

 

జగన్‌పై కేంద్ర మాజీ మంత్రి విమర్శలు! రాజకీయ వాతావరణంలో కలకలం! ఆరు నెలల్లో ఈయన ఎక్కడ ఉంటారో?

 

భరించలేని కీళ్ళ నొప్పులు ఈ సూపర్ ఫుడ్స్ తో తగ్గుతాయి! మరీ ఎందుకు ఆలస్యం తెలుసుకోండి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! అమరావతిపై ఢిల్లీ బిగ్ అప్డేట్ - గేమ్ ఛేంజర్! సీఆర్డీఏ కొత్త ప్రణాళికలు సిద్దం! ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Ramcharan #Tollywood #IndianArtandCulture