5 డోర్లతో మహీంద్రా నుంచి సరికొత్త ‘థార్ రాక్స్’ ! విడుదల తేదీ, ఇతర వివరాలు - అందుబాటు ధరలోనే! ఎందుకు ఆలస్యం ఒక లుక్ వేయండి!

Header Banner

5 డోర్లతో మహీంద్రా నుంచి సరికొత్త ‘థార్ రాక్స్’ ! విడుదల తేదీ, ఇతర వివరాలు - అందుబాటు ధరలోనే! ఎందుకు ఆలస్యం ఒక లుక్ వేయండి!

  Sun Jul 21, 2024 09:00        Auto

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్  మహీంద్రా దేశీయ మార్కెట్లో మరో సరికొత్త వాహనం ఆవిష్కరణకు సిద్ధమైంది. 5 డోర్లతో ‘మహీంద్రా థార్ రాక్స్’ను విడుదల చేయబోతున్నట్టు ఇవాళ(శనివారం) ప్రకటించింది. దీనిని ఆగస్టు 15న ఆవిష్కరించబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కారు టీజర్‌ను విడుదల చేసింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే తేదీన ‘థార్’ను మార్కెట్‌లో ప్రవేశపెట్టామని పేర్కొంది. ‘థార్ రాక్స్’లో కొత్త రెండు డోర్లు జత చేశామని, కారు పొడవు, వీల్‌బేస్‌ పెరిగాయని కంపెనీ వివరించింది. ‘థార్ రాక్స్’ డిజైన్‌ను కూడా ఆధునికీకరించామని వివరించింది. సర్క్యూలర్ హెడ్‌లైట్లు, గ్రిల్ కూడా కొత్తవేనని తెలిపింది.

 

ఇంకా చదవండి: కీబోర్డ్‌తో నడిచే కారు తయారు చేసి సంచలనం సృష్టించిన! పాకిస్థాన్ యువకుడు!

 

కాగా కొన్ని మార్పులతో వచ్చినప్పటికీ నాలుగేళ్ల క్రితం విడుదలైన మహీంద్రా ఎస్‌యూవీ 'థార్'కు చెందినదే అనే భావం కలుగుతోంది. మహీంద్రా థార్ రాక్స్ ఆరంభ ధర సుమారు రూ.13 లక్షల నుంచి ప్రారంభమవ్వొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక గరిష్ఠ ధర ఎక్స్-షోరూమ్‌లో రూ.25 లక్షల వరకు ఉండొచ్చని కథనాలు పేర్కొంటున్నాయి. ఇక థార్ 5-డోర్ ప్రత్యేకతల విషయానికి వస్తే... 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్, 2.2లీటర్ డీజిల్ ఇంజన్ రెండు ఇంజన్ ఆప్షన్లకు అవకాశం ఉంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లకు ఛాన్స్ ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. థార్ రాక్స్ ఒక 4x4 డ్రైవ్‌ట్రెయిన్‌, తక్కువ నిష్పత్తిలో గేర్‌బాక్స్, వెనుక యాక్సిల్‌కు మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్, ఫ్రంట్ యాక్సిల్‌కు బ్రేక్-లాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది. మార్కెట్లో ధరలను పోటీగా ఉంచేందుకుగానూ టూ-వీల్ డ్రైవ్ వేరియంట్‌లను కూడా మహీంద్రా కంపెనీ ఆఫర్ చేయవచ్చునని కథనాలు పేర్కొంటున్నాయి.


ఇంకా చదవండి: మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కు బ్రేక్ వేసిన పోలీసులు! వారికి నో ఎంట్రీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేను అంబానీ చుట్టాన్ని కాదా? పెళ్లికి నన్నెందుకు పిలవలేదు? క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నానని..జ్యోతిరెడ్డి

 

సినీనటి పై పోలీసు కేసు! అసలు ఆమె ఏమి చేసిందంటే?

 

శవ రాజకీయాలు చేయడం జగన్‌ పద్ధతి! 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిన సైకో!

 

ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...

 

ఏపీకి శుభవార్తను వినిపించిన కేంద్ర ప్రభుత్వం! విజయవాడ డివిజన్ పరిధిలో 40 రైళ్లకు కొత్తగా 30 రైల్వేస్టేషన్లలో హాల్టింగ్!

 

సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!

 

రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభవార్త! రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం!

 

రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TharRoxx #Mahindra #TharRoxxAutomobilenews #NewCars