మారుతి సుజుకి కార్లపై భారీ తగ్గింపు.. తక్కువ ధరకే కొనే గోల్డెన్ ఛాన్స్.!

Header Banner

మారుతి సుజుకి కార్లపై భారీ తగ్గింపు.. తక్కువ ధరకే కొనే గోల్డెన్ ఛాన్స్.!

  Tue Sep 03, 2024 09:00        Auto

కొత్త కారు కొనాలని ప్లాన్‌ చేస్తున్న వారికి గుడ్‌న్యూస్‌. పండగ సీజన్‌కి ముందే మారుతి సుజుకి (Maruti Suzuki) ఇండియా బంపరాఫర్లు ప్రకటించింది. తాజాగా ఆల్టో కె10 (Alto K10), ఎస్-ప్రెస్సో (S-Presso) మోడళ్లలో కొన్ని వేరియంట్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు 2024 సెప్టెంబర్ 2 నుంచి అమల్లోకి వస్తాయి. ఎస్-ప్రెస్సో ఎల్‌ఎక్స్‌ఐ పెట్రోల్ వేరియంట్ ధర రూ.2,000 తగ్గింది. అలానే ఆల్టో కె10 వీఎక్స్‌ఐ పెట్రోల్ వేరియంట్ ఇప్పుడు రూ.6,500 తక్కువ ధరకు లభిస్తుంది. మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కంపెనీ సెక్రటరీ సంజీవ్ గ్రోవర్ ఈ సమాచారాన్ని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బీఎస్‌ఈకి తెలియజేశారు. మారుతీ సుజుకి 2024 ఆగస్టులో మొత్తం అమ్మకాల్లో ఇయర్‌-ఆన్‌-ఇయర్‌ ప్రాతిపదికన 4 శాతం క్షీణతను ప్రకటించింది. కంపెనీ గత నెలలో 181,782 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది ఇదే కాలంలో 189,082 యూనిట్లు అమ్ముడయ్యాయి. అలానే డొమెస్టిక్‌ ప్యాసింజర్ వెహికల్‌ విభాగంలో 8 శాతం క్షీణత కనిపించింది. 2023 ఆగస్టులో అమ్మకాలు 156,114 యూనిట్ల నుంచి ఈ ఏడాది అదే సమయానికి 143,075 యూనిట్లకు పడిపోయాయి.

 

ఇంకా చదవండి: ఎట్టకేలకు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన 5-డోర్ మహీంద్రా థార్! ధర ఎంతో తెలుసా!

 

ముఖ్యంగా మినీ, కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లలో భారీగా సేల్స్‌ తగ్గడం గమనించవచ్చు. ఆల్టో, ఎస్-ప్రెస్సో సహా మారుతి మినీ కార్ల అమ్మకాలు 2024 ఆగస్టులో 10,648 యూనిట్లకు పడిపోయాయి. గత ఏడాది ఆగస్టులో 12,209 యూనిట్లు అమ్ముడుపోయాయి. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ వంటి పాపులర్‌ మోడల్స్‌ ఉన్న కాంపాక్ట్ కార్ సెగ్మెంట్‌లో కూడా 20 శాతం తగ్గుదల నమోదైంది. గత ఏడాది 72,451 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది 58,051 యూనిట్లకు పరిమితమైంది. అయితే గ్రాండ్ విటారా, బ్రెజ్జా, ఎర్టిగా, ఇన్విక్టో, ఫ్రాంక్స్, XL6 వంటి మోడల్స్‌ ఉన్న యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్‌లో డిమాండ్‌ కనిపించింది. గత ఏడాది 58,746 యూనిట్ల నుంచి ఈ ఏడాది 62,684 యూనిట్లకు పెరిగింది. మొత్తం 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. Eeco వాన్ సేల్స్‌ 10,985 యూనిట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. అయితే సూపర్ క్యారీ లైట్ కమర్షియల్ వెహికల్ స్వల్ప తగ్గుదలని చూసింది. అంతకుముందు సంవత్సరం 2,564 యూనిట్లతో పోలిస్తే, ఈ ఏడాది 2,495 యూనిట్లు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ, ఆగస్టులో కంపెనీ వాహనాల పంపకాలను 13,000 యూనిట్లు తగ్గించిందని చెప్పారు. ‘మా డీలర్లు విక్రయించడానికి తగినంత స్టాక్‌ మెయింటైన్‌ చేయడంపై దృష్టి పెట్టాం. అలానే స్టాక్‌ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాం.’ అని వివరించారు.

ఇంకా చదవండి: వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బహరైన్ లో నటసింహం నందమూరి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు! గల్ఫ్ వైడ్ ప్రముఖులతో 19 న మెఘా ప్రోగ్రాం - అభిమానులతో సందడే సందడి!

 

శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. కొత్త పెన్షన్లకు డేట్ ఫిక్స్! ఇలా అప్లై చేసుకోండి!

 

అమెరికాలో దారుణం.. యువ‌తిని కాల్చి చంపిన భార‌త సంత‌తి వ్య‌క్తి! అసలు ఏమి జరిగింది అంటే!

 

నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!

 

ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను!

 

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!

 

వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. హైడ్రా నోటీసులు! హైదరాబాద్ ఇల్లు కూల్చివేత?

 

94 రైళ్లు రద్దు! మీరు వెళ్లే రైళ్లు ఈ లిస్టులో ఉన్నాయా?

 

క్రెడిట్‌ కార్డు వాడేవారికి అలర్ట్.. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్! ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ..!

 

యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ అందిస్తున్న జియో! అది ఏమిటంటే..? ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో..

 

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!

 

వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!

 

కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!

 

జగన్ అడ్డాలో ఇసుక దందా,జిల్లా ఎస్పీ సీరియస్! నేరుగా నదిలోకి వెళ్లి? ఇంత జరిగినా కూడా బుద్ధి పోనిచ్చుకోలేదు!

 

మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

 

రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #MarutiSuzuki #Alto-K10 #Auto #NewCar