క్యాన్సర్ ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్! ఎలా పనిచేస్తుందంటే?

Header Banner

క్యాన్సర్ ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్! ఎలా పనిచేస్తుందంటే?

  Sun Sep 15, 2024 14:35        Health

క్యాన్సర్... ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను హరిస్తున్న ఈ మహమ్మారికి ఇప్పటి వరకూ నిర్దిష్టమైన ఔషధమంటూ లేదు. రేడియేషన్ వంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవేవీ పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వడంలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పైపెచ్చు వీటితో అనేక దుష్ప్రభావాలు ఉంటాయని చెప్పారు.  

 

ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ పై పోరాటానికి సరికొత్త వ్యాక్సిన్ ను ఇంగ్లాండ్ సైంటిస్టులు అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు చేస్తున్న తొలి దశ ప్రయోగాలలో ఆశ్చర్యకరమైన ఫలితాలు గుర్తించినట్లు చెప్పారు. 

 

ఇంకా చదవండిమోదీ పుట్టినరోజు నాడు అజ్మీర్ దర్గా ఆధ్వర్యంలో 4 వేల కిలోల శాకాహారం పంపిణీ కార్యక్రమం! ఎక్కడో తెలుసా? 

 

ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక క్యాన్సర్ మరణాలు గణనీయంగా తగ్గుతాయని, చికిత్సలో మెరుగైన ఫలితాలు వస్తాయని వివరించారు. ఈ వ్యాక్సిన్ కు వారు ఎంఆర్ఎన్ఏ–4359 అని నామకరణం చేశారు. ఈ వ్యాక్సిన్ తో పెద్దగా దుష్ప్రభావాలు ఉండవని చెప్పారు. 

 

వ్యాక్సిన్ పనిచేసేది ఎలా అంటే...

లండన్ లోని కింగ్స్ కాలేజ్ లో ఎక్స్ పెరిమెంటల్ ఆంకాలజీలో క్లినికల్ రీడర్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ దేబాశిష్ సర్కార్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఎంఆర్ఎన్ఏ–4359 వ్యాక్సిన్ మానవ శరీరంలోని సహజ రోగనిరోధక శక్తిని మరింత ఉత్తేజితం చేస్తుంది. క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు తోడ్పడుతుంది. సాధారణ కణాలు, క్యాన్సర్ కణాలకు మధ్య తేడాను గుర్తించి, క్యాన్సర్ కణాలను ఎదగకుండా అడ్డుకునేలా చేస్తుంది. 

 

ఇంకా చదవండికొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అంతేకాదు, కొత్త క్యాన్సర్ కణాలు పుట్టుకు రాకుండా అడ్డుకుంటుంది. క్యాన్సర్ కణాలు శరీరంలో వేగంగా విస్తరించి కణుతులుగా ఏర్పడతాయి. దీనిని అడ్డుకోవడానికి రోగ నిరోధక శక్తిని ఈ వ్యాక్సిన్ ప్రోత్సహిస్తుంది. తద్వారా క్యాన్సర్ ను నిర్మూలించడానికి ఈ వ్యాక్సిన్ ఓ కొత్త మార్గాన్ని చూపుతుంది. క్యాన్సర్ చికిత్సలో కొత్త మందుల ఆవిష్కరణకు ఈ వ్యాక్సిన్ ఓ ముందడుగు అని డాక్టర్ దేబాశిష్ సర్కార్ చెప్పారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

జగ్గయ్యపేటలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్! ప్రముఖ నేత టిడిపిలో చేరిక! మరికొంతమంది వైసీపీ నేతల మార్పు?

 

ఐఆర్‌సీటీసీ వెంకటాద్రి టూర్ ప్యాకేజీ.. అతి తక్కువ ఖర్చుతో 4 రోజుల తిరుమల యాత్ర! ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరకదు!

 

మద్యం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌! ఆ రెండు రోజులు వైన్స్‌ బంద్‌!

 

ఈ ఆరు దేశాల్లో వాట్సాప్‌పై నిషేధం! దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసా?

 

రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపేపండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Health #Cancer #Vaccine #Treatment #Life