మటన్ ఎలా పడితే అలా తినకండి! కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం!
Mon Dec 30, 2024 12:46 Healthచాలా మంది మటన్ ఇష్టంగా తింటారు. కొంతమందికి మటన్ లేనిదే ముద్దదిగదు. ఇక, సండే వచ్చిందంటే చాలు మటన్‌ను లాగించాల్సిందే. ఈ రోజుల్లో వారంతో సంబంధం లేకుండా చికెన్, మటన్‌ను లాగిస్తున్నారు. మటన్ బిర్యానీ, మటన్ ఫ్రై, మటన్ చాప్ స్టిక్స్, మటన్ ఫ్రై ఇలా ఏ ఐటమ్ అయినా సరే తగ్గేదే లే అని ఓ పట్టు పడుతున్నారు. మటన్ రేటు ఎక్కువ ఉన్నా సరే కొందరు వారానికి రెండు, మూడు సార్లు తింటుంటారు. మటన్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మటన్‌లో వివిధ రకాల సహజమైన, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
ఒలేయిక్ యాసిడ్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, ఇది ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం కూడా మటన్‌లో పుష్కలంగా ఉంటుంది. అయితే, మటన్ ఎలా పడితే అలా తినకూడదు. చాలా మంది ఇష్టమని చెప్పి ఎక్కువ తింటారు. అదే వాళ్లు చేసే తప్పు. మటన్ ఎక్కువగా తినడం వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మటన్ ఎలా, ఎంత, ఎప్పుడు తినాలో ఇక్కడ తెలుసుకోండి.
మటన్ ఎక్కువ తినకూడదని నిపుణులు అంటున్నారు. కొంతమంది, మటన్ తింటే ఆరోగ్యానికి మంచిదన్న భావనతో ప్రతిరోజూ తింటూ ఉంటారు. ఎక్కువగా తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. ఆ సమస్యలేంటో చుద్దాం.
మటన్ ఎక్కువ తినడం మంచిది కాదు. మటన్ రోజూ తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్య ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదముంది. మటన్‌లో సంతృప్తికర కొవ్వులు అధిక స్థాయిలో ఉంటాయి. దీంతో.. మటన్ అధిక మోతాదులో తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అందుకే మటన్ తక్కువ మోతాదులో తినాలని సూచిస్తున్నారు.
ఇంకా చదవండి: అతి తక్కువ ధరలో 5జీ ఫోన్.. మతిపోగొట్టే ఫీచర్లతో విడుదల! ఆ వివరాలు మీకోసం.. Don't Miss!
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మటన్ రోజూ తింటే బరువు పెరిగే ప్రమాదముంది. మటన్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి సాధ్యమైనంత వరకు త్వరగా బర్న్ అవ్వాలి. ఇవి బర్న్ అవ్వకపోతే బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. దీంతో అధిక బరువు పెరిగే ప్రమాదముంది. అందుకే మటన్ ఎక్కువగా తినకూడదంటున్నారు నిపుణులు.
మటన్ అధికంగా తినడం వల్ల శరీరంలోని కొన్ని రకాల క్యాన్సర్ కణాలు తయారవుతాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. దీని కారణంగా వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే మటన్ ఎక్కువగా తినకూడదు. అంతేకాకుండా ఇప్పటికే క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు మటన్ తినకపోవడమే ఉత్తమం అంటున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది అధిక యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు మటన్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ ప్రమాదం పెరుగుతుంది. దీంతో కీళ్ల నొప్పుల్లో స్పటికాలు నిక్షిప్తమై నొప్పులు తీవ్రమవుతాయి. అంతేకాకుండా శరీరంలో ఇన్ఫ్లమేషన్ లెవల్స్ పెరుగుతాయి. దీంతో వేడి చేసే అవకాశం ఉంది. మటన్ ఎక్కువ తింటే మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మటన్ ఎలా పడితే అలా తినకుండా.. మితంగా తినాలి. ప్రతి రోజూ తినడం వల్ల ఆరోగ్యం డేంజర్‌లో పడుతుంది. వారానికి ఒకసారి మాత్రమే మటన్ తినడం బెస్ట్ అంటున్నారు. అది కూడా 200 గ్రాములకు మించకూడదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మటన్ రాత్రి వేళల్లో తినకూడదంటున్నారు. ఎందుకంటే మటన్ జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో జీర్ణ సమస్యలు వచ్చి నిద్ర భంగం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక, మటన్ బాగా ఉడికించి తినాలని సూచిస్తున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో పెట్రేగిపోతున్న ట్రోలింగ్.. బొత్స కాళ్లు నేనెందుకు పట్టుకుంటాను? క్లారిటీ ఇచ్చిన మంత్రి!
అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!
వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!
చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!
నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Health #Foods #Diet #Mutton #HealthyFoods #Meat
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.