ప్రపంచంలోనే సురక్షితమైన నగరం ఇదే! దీని ప్రత్యేకత ఏంటంటే!

Header Banner

ప్రపంచంలోనే సురక్షితమైన నగరం ఇదే! దీని ప్రత్యేకత ఏంటంటే!

  Sat Aug 24, 2024 18:55        World

ఈ మధ్య ఎక్కడ చూసినా ప్రమాదాలు, నేరాలు, ఘోరాలకు సంబంధించిన వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. మెట్రో సిటీస్లోనూ భద్రతా పరమైన సమ్యలు తలెత్తుతున్నాయి. దీంతో ప్రజలు, టూరిస్టులు నివసించడం, సందర్శించడం వంటి విషయాల్లో సేఫ్టీకి సంబంధించిన ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోకెల్లా సురక్షితమైన నగరమేది? అనే సందేహాలు కూడా పలువురిలో వ్యక్తంగా అవుతున్నాయి. నిపుణుల ప్రకారం ఆ వివరాలేంటో చూద్దాం.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండి: డయాబెటిస్ ఉన్న వారు ప్రతి రోజూ మధ్యాహ్నం ఇలా చేయండి! షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి!  

 

అన్ని విధాలా సేఫ్ గా ఉండే ప్రాంతం లేదా దేశానికి వెళ్లిరావాలని అనుకోవడం సహజమే. ముఖ్యంగా టూరిస్టులు ఈ విషయంలో ఇంట్రెస్ట్ చూపుతుంటారు. కాగా భద్రతా రీత్యా సురక్షిత నగరం ఏదని చూసినప్పుడు వరల్డ్ క్రైమ్ అండ్ సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం.. అబుదాబి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ నగరాన్ని ప్రపంచంలో భద్రతా పరంగా 88.2, నేరాల పరంగా 11.8 స్కోర్లతో ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ గ్లోబల్ లైవ్ బిలిటీ ఇండెక్స్ ప్రజలందరూ సురక్షితంగా నివసించగలిగే, సందర్శించగలిగే సురక్షిత నగరంగా పేర్కొన్నది.

 

నేరాల పరంగా చూసినా అబుదాబిలో క్రైమ్ రేట్ చాలా తక్కువట. దీంతో ఇది వరల్డ్ ఫేమస్ అంట్ సేఫ్టీ టూరిస్ట్ దేశంగా ప్రసిద్ది చెందింది. అయితే ఇక్కడ సందర్శించదగిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ఎక్కడ కూడా వేధింపులు, దొంగతనాలు, ప్రజలను తప్పుదోబ పట్టించడం వంటి నేరాలు, భద్రతాపరమైన సమస్యలు ఉండవని నిపుణులు చెప్తున్నారు.

 

ఇంకా చదవండి: యూకే: జాబ్ ఆఫర్ లేకుండా ప్రవాసుల కోసం టాప్ 5 మార్గాలు! అవి ఏంటో చూద్దామా? 

 

ఇక టూరిస్టులు సందర్శించడానికి ఆసక్తి చూపే ప్రాంతాల విషయానికి వస్తే అబుదాబిలోని ఐలాండ్ -యాస్ ద్వీపం, ఫెరారీ వరల్డ్, యాస్ వాటర్ ల్యాండ్, ఆక్వా పార్క్, బ్రదర్ థీమ్స్, ఇండోర్ వార్నర్, యాస్ మాల్, మెరీనా ఫార్ములా వంటి ప్రదేశాల్లో ఎటువంటి భయం లేకుండా తిరగవచ్చు. అట్లనే లివా ఒసాయసిస్ అనే పురాతన సంప్రదాయ గ్రామం కూడా ఇక్కడ ఫేమస్.

 

ఎక్కువగా ఎడారినే కనిపించే ఈ ప్రాంతంలో సఫారీ జీపులోనో, ఒంటెపైనో తిరిగి చూడవచ్చు. వెన్నెల రాత్రుల్లో ఈ ఏడారిలో ఎంజాయ్ చేసేందుకు చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. అయినా భద్రతా పరమైన సమస్యలు ఉండవు. వీటితోపాటు అబుదాబిలో ఇంకా అనేక పర్యాటక ప్రాంతాలు ఆకట్టుకోవడమే కాకుండా సందర్శించడానికి సేఫ్గా ఉంటాయి. ఇక సురక్షితమైన నగరాల జాబితాలో అబుదాబి తర్వాత అజ్మాన్, దోహ, తైపీ, దుబాయ్ వరుసగా రెండు నుంచి ఐదవ స్థానంలో నిలిచాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బంపర్ ఆఫర్! గెలిస్తే రూ.50 లక్షలు మీవే! 

 

అతడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే! జగన్ పై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు! 

 

ఎయిర్ ఇండియాకు భారీ షాక్ ఇచ్చిన DGCA! ఏకంగా రూ.98 లక్షల జరిమానా! 

 

ఎన్నికల వేళ ట్రంప్, కమలా హారిస్ అరెస్ట్! వైరల్ అవుతున్న వీడియో! 

 

అనిల్ అంబానీ సహా 24 సంస్థలపై సెబీ చర్యలు! రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కుంభకోణం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #World #SafestCity #Gulf #Abudhabi