భారతీయ విద్యార్థులకు కెన‌డా షాక్‌.. స‌గానికి త‌గ్గ‌నున్న స్ట‌డీ వీసాలు! దానికి కారణం అదేనా!

Header Banner

భారతీయ విద్యార్థులకు కెన‌డా షాక్‌.. స‌గానికి త‌గ్గ‌నున్న స్ట‌డీ వీసాలు! దానికి కారణం అదేనా!

  Wed Sep 11, 2024 10:26        U S A

కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు అక్క‌డి ప్ర‌భుత్వం షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్ప‌టికే కొత్త వ‌ల‌స విధానం, విదేశీ విద్యార్థుల వార‌పు ప‌నిగంట‌ల‌ను జ‌స్టిన్ ట్రూడో ప్ర‌భుత్వం త‌గ్గించింది. దీంతో అక్క‌డ ఉన్న మ‌న వారిపై ఆర్థిక భారం పెరిగింది. ఇప్పుడు ఈ ఏడాది ఇండియ‌న్ స్టూడెంట్స్‌ స్టడీ పర్మిట్ ఆమోదాలు దాదాపు 50శాతం మేర‌ తగ్గుతాయని కెన‌డా ఎడ్యుకేష‌న్ టెక్నాల‌జీ కంపెనీ అప్లైబోర్డ్ నివేదిక తాజాగా అంచనా వేసింది. 2018, 2019లో వ‌చ్చిన‌ విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో కెనడియన్ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు నివేదిక పేర్కొంది. దీంతో ఈ ఏడాది స్ట‌డీ ప‌ర్మిట్ల‌ ఆమోదాల క్షీణత ఏర్పడింద‌ని తెలిపింది. అప్లైబోర్డ్‌ నివేదిక నుండి వచ్చిన ఈ స‌మాచారాన్ని ది గ్లోబ్ అండ్ మెయిల్ మంగళవారం ప్రచురించింది. "ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారత్‌ నుండి స్టడీ పర్మిట్ల ఆమోదాలు సగానికి తగ్గాయి" అని నివేదిక పేర్కొంది. ఇది పూర్తి ఏడాది ఇలాగే కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో అంతర్జాతీయ విద్యార్థులను అనుసంధానించే సంస్థ అప్లైబోర్డ్‌ నివేదిక. 2023లో ఆమోదించబడిన విదేశీ విద్యార్థుల స్ట‌డీ వీసాల సంఖ్య 4,36,000గా ఉంది. కానీ, 2024లో ఇప్ప‌టివ‌ర‌కు కేవలం 2,31,000గా ఉందని నివేదిక తెలిపింది. 

 

ఇంకా చదవండి: అమెరికాలో విషాద‌క‌ర ఘ‌ట‌న‌! నీట మునిగి ఇద్ద‌రు తెలుగు చిన్నారుల మృత్యువాత‌! మీడియా స‌మాచారం ప్ర‌కారం!

 

దీని ప్ర‌కారం 2023తో పోలిస్తే 2024లో కెనడియన్ స్టడీ పర్మిట్‌ల కోసం గ్లోబల్ అప్లికేషన్‌లలో 39శాతం తగ్గుదల ఉంద‌ని నివేదిక అంచనా వేసింది. ఇక 2022లో కెనడాలోని 5.5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులలో 2.26 లక్షల మంది ఇండియ‌న్ స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే 3.2 లక్షల మంది భారతీయులు స్టూడెంట్ వీసాలపై కెనడాలో ఉంటూ గిగ్ వర్కర్లుగా ఆ దేశ‌ ఆర్థిక వ్యవస్థకు సహకరించారు. అంతర్జాతీయ విద్యార్థులకు ఆర్థిక అవసరాలను పెంచేలా (ఇటీవ‌ల విద్యార్థుల ప‌ని గంట‌ల‌ను త‌గ్గించ‌డం) కెనడియన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు చాలా మంది భావి విద్యార్థులను నిరుత్సాహపరిచాయని అప్లైబోర్డు సీఈఓ, సహ వ్యవస్థాపకుడు మేటి బసిరి తెలిపారు. " కెనడా ఒకప్పుడు అంతర్జాతీయ విద్యార్థులకు స్వాగతించిన విధంగా ఇటీవ‌ల కాలంలో ఆ ప‌రిస్థితులు కనిపించడం లేదు" అని బసిరిని ఉటంకిస్తూ ది గ్లోబ్ అండ్ మెయిల్ పేర్కొంది. దాంతో చాలామంది విదేశీ విద్యార్థులు ఇప్పుడు కెన‌డాకు స్టడీ ప‌ర్మిట్ల కోసం దరఖాస్తు చేయ‌డం లేదు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి ఇతర గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు.

 

ఇంకా చదవండి: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!

 

అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

 

చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి ఏడాది! ఆరోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు! మంత్రి ఫైర్!

 

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం! ఆ వ్యాపారవేత్తకు బెయిల్!

 

ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!

 

జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు!

 

ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!

 

స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

 

హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Canada #Study #Visa #Indian