ట్రంప్‌పైనే ఎందుకు? వాళ్లపై హత్యాయత్నాలు చేయలేదేం? ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

Header Banner

ట్రంప్‌పైనే ఎందుకు? వాళ్లపై హత్యాయత్నాలు చేయలేదేం? ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

  Mon Sep 16, 2024 15:59        U S A

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ పై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు ఆయనపై దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. అయితే కాల్పుల ఘటన అనంతరం ట్రంప్‌ సురక్షితంగానే ఉన్నారని ఆయన ప్రచార బృందం అధికార ప్రతినిధి స్టీవెన్‌ చెంగ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనపై బిలియనీర్‌, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ఈ మేరకు డెమోక్రాటిక్‌ పార్టీ నేతలపై సందేహం వ్యక్తం చేశారు.

 

ఇంకా చదవండి: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మాజీ అధ్యక్షుడిపైనే ఎందుకు మర్డర్‌ అటెంప్ట్‌ జరుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను చంపేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘వారు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఎందుకు చంపాలనుకుంటున్నారు..?’ అని ఎక్స్‌ వినియోగదారు అడిగిన ప్రశ్నకు మస్క్‌ సమాధానమిస్తూ.. ‘అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు’ అంటూ సందేహం వ్యక్తం చేస్తున్న ఎమోజీని జత చేశారు. ప్రస్తుతం మస్క్‌ ట్వీట్‌ వైరల్‌గా మారింది. నవంబర్‌ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఎలాన్‌ మస్క్‌ పూర్తి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ట్రంప్‌ను మస్క్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు.

 

ఇంకా చదవండిఛత్తీస్ గఢ్ లో దారుణం.. చేతబడి అనుమానంతో ఐదుగురి హత్య! అసలు విషయం తెలిస్తే షాక్! 

 

గత నెల 30న పెన్సిల్వేనియా లోని జాన్స్‌టౌన్‌ లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ దుండగుడు వేదికవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్‌ స్టేజ్‌పై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు వేగంగా స్టేజ్‌ వైపు దూసుకొచ్చాడు. దాదాపు మీడియా పాయింట్‌ వరకూ వచ్చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!

 

ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...

 

ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్‌ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్‌!

 

ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారా? రహస్యంగా మూడో కంటికి తెలియకుండా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

   


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants