పైకి చూస్తే పూలతోట.. లోన మాత్రం కథ వేరే! గొప్పోడివయ్యా సామీ! మనోడి తెలివిని చూసిన పోలీసులు షాక్!

Header Banner

పైకి చూస్తే పూలతోట.. లోన మాత్రం కథ వేరే! గొప్పోడివయ్యా సామీ! మనోడి తెలివిని చూసిన పోలీసులు షాక్!

  Mon Jul 15, 2024 08:00        India

సమాజంలో రోజురోజుకూ నేరగాళ్లు తెలివి మీరిపోతున్నారు. పోలీసులకు దొరకకూడదనే ఆలోచనలతో కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నారు. అలానే ఓ ప్రబుద్ధుడు పోలీసులకు మస్కా కొట్టాలనుకున్నాడు. ఖాకీ చొక్కాలకు దొరకకూడదనే ఉద్దేశంతో ఓ కన్నింగ్ ప్లాన్ వేశాడు. అయితే మనోడి ప్లాన్ అడ్డం తిరిగి.. పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో జరిగింది. మనోడి తెలివిని చూసిన పోలీసులు తొలుత షాక్ తిన్నారు. ఆ తర్వాత కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టి. వీరాపురం గ్రామానికి చెందిన వన్నూరు స్వామి అనే వ్యక్తి ఓ తోటకు కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. తోటలో బంతిపూలు, కనకాంబరాలు సాగుచేస్తున్నారు. అయితే గంజాయి మత్తుకు అలవాటుపడిన వన్నూరు స్వామి.. ఆ కనకాంబరాల మొక్కల మధ్యనే గంజాయి మొక్కలు నాటాడు.

 

ఇంకా చదవండి: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! ఇద్దరు మృతి... 20 మందికి గాయాలు!

 

కనకాంబరాలు, బంతిపూల మధ్యన నాలుగు గంజాయి మొక్కలు నాటిన వన్నూరు స్వామి.. వాటిని పీలుస్తూ మత్తులో తేలిపోయేవాడు. అయితే మనోడు సాగిస్తున్న ఈ వ్యవహారం ఆ పూలతోట యజమానికి కూడా తెలియదట. కానీ ఊహించని రీతిలో మనోడి పత్తాపారం బయటపడింది. టి. వీరాపురం గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారంటూ ఎవరో ఆకాశ రామన్న పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే వన్నూరు స్వామి పనిచేస్తున్న తోట దగ్గరకు వెళ్లిన పోలీసులు.. అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూసి షాక్ తిన్నారు. పూల మొక్కల మధ్య గంజాయి మొక్కలను గమనించిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో తానే ఆ మొక్కలు పెంచుతున్న విషయాన్ని వన్నూరు స్వామి అంగీకరించాడు. అనంతరం నిందితుడి వద్ద నుంచి ఏడు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వన్నూరు స్వామిని అరెస్ట్ చేశారు. అయితే తన తోటలో గంజాయి మొక్కలు సాగు చేసిన సంగతి తనకు తెలియదని ఆ తోట యజమాని చెప్తున్నారట. పూల మొక్కల మధ్య గంజాయి మొక్కలు నాటి అతి తెలివితో వ్యవహరించిన వన్నూరు స్వామి.. అలా అనుకోకుండా పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇలా సాగుచేసిన గంజాయిని వన్నూరు స్వామి మాత్రమే సేవిస్తున్నాడా.. బయట వ్యక్తులకు కూడా విక్రయించేవాడా అనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

 

 


ఇంకా చదవండి: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వందేభారత్ స్లీపర్ తొలి రైలు ఈ రూట్‌లోనే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలనంగా మారిన ట్రంప్‌పై కాల్పులు.. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా.. లైవ్ లో రికార్డ్ అయిన సంఘటన! వెంటనే ఆదేశాలు జారీ చేసిన వైట్ హౌస్!

 

చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన మంత్రులు! ఎందుకో తెలుసా?

 

గత ఐదేళ్లుగా కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు! చంద్రబాబు స్పెషల్ ఫోకస్! పార్టీ కోసం కష్టపడిన వారిని 5 విధాలుగా!

 

ఈ దేశాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఆదాయం ఎంతున్నా ఎవరూ అడగరు! ఆహా ఎంత అదృష్టమో!

 

కువైట్ ఎడారిలో ఒక తెలుగు ప్రవాసుడి ఆవేదన! ఎవరూ స్పందించకపోతే ఆత్మహత్యే దిక్కు!

 

చాక్లెట్ ఇప్పిస్తానాని, చిన్నారిపై లైంగిక దాడి ! వైద్యులు ఏం చెప్పారంటే!

 

అది శంకర్ 'భారతీయుడు' .. మరి ఇది? పబ్లిక్ టాక్! నిన్ననే థియేటర్లలో విడుదలైన సినిమా!

 

భారత్-రష్యా సంబంధాలు మరింత పటిష్టం! అమెరికాను వ్యూహాత్మకంగా దారిలోకి తెచ్చుకుంటున్న మోడీ! భారత్ ప్రతిష్ట మరింత పైకి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #Anantapur