28 ఏళ్ల క్రితం బహరేన్ కు వెళ్లిన తెలంగాణ వ్యక్తి! అక్రమ నివాసం కేసులో జనవరి నుండి జైలుపాలు! అసలు స్టోరీ ఇదే - ఇలా మీకు కూడా జరగవచ్చు!

Header Banner

28 ఏళ్ల క్రితం బహరేన్ కు వెళ్లిన తెలంగాణ వ్యక్తి! అక్రమ నివాసం కేసులో జనవరి నుండి జైలుపాలు! అసలు స్టోరీ ఇదే - ఇలా మీకు కూడా జరగవచ్చు!

  Mon Aug 12, 2024 15:21        Bahrain

సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన మానువాడ నర్సయ్య (62) అనే వృద్ధుడు జనవరి నుంచి బహరేన్ జైలులో మగ్గుతున్నాడు. చీర్లవంచ గ్రామం మధ్య మానేరు నీటిపారుదల ప్రాజెక్టులో ముంపుకు గురవడం వలన నర్సయ్య కుటుంబం ప్రస్తుతం అగ్రహారం పునరావాస కాలనీలో నివసిస్తున్నారు. ఇతను గతంలో నివసించిన గోపాల్ రావుపల్లి గ్రామ రేషన్ కార్డు, ఓటరు కార్డు ఇప్పుడు అతను భారతీయుడు అని నిరూపించుకోవడానికి ఆధారంగా పనికివస్తున్నాయి. నర్సయ్య ను భారత్ కు తెప్పించాలని అతని భార్య లక్ష్మి, కూతుళ్లు సోన, అపర్ణ, కుమారుడు బాబు కోరుతున్నారు. బహరేన్ ప్రభుత్వ సంస్థ 'లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ' 2024 జనవరి 8న బహరేన్ లోని భారత రాయబారికి ఒక లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇతని పాస్‌పోర్ట్ అందుబాటులో లేదు, పోయినట్లు నివేదించబడింది. చట్టవిరుద్ధమైన స్థితిలో ఉన్నాడు. ఇతన్ని బహరేన్ నుంచి భారత్ కు పంపించడం (డిపోర్ట్) కోసం ఇండియన్ ఎంబసీ వారు 'అవుట్ పాస్' (తాత్కాలిక పాస్‌పోర్ట్) జారీ చేయాలని ఆ లేఖలో కోరారు. బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ వారు ఆగస్టు 4న హైదరాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయానికి ఒక లేఖ రాశారు. మానువాడ నర్సయ్యను అతని ఫోటోను  ధ్రువీకరించాలని కోరారు. 

 

ఇంకా చదవండి: సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?

 

28 ఏళ్ల క్రితం... 1996 సెప్టెంబర్ 23న బహరేన్ దేశానికి చేరుకున్నప్పుడు మానువాడ నర్సయ్య వయస్సు 34 ఏళ్ళు. ది అరబ్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీలో మూడేళ్ళ పాటు తాపీ మేస్త్రీ గా పనిచేసి ఆగస్టు 1999 లో వర్క్ పర్మిట్ ముగిసినట్లు  ఎల్ఎంఆర్ఏ రికార్డుల వలన తెలుస్తున్నది. హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం వారు1989 సెప్టెంబర్ 22న పాస్‌పోర్ట్ జారీ చేశారు. బహరేన్ ఇండియన్ ఎంబసీ వారు 2001 నవంబర్ 18న పాస్ పోర్ట్ ను రెనివల్ చేశారు. ఇప్పుడు దాని గడువు ముగిసిపోయింది. మానువాడ నర్సయ్య విషయాన్ని బహరేన్ లోని సామాజిక కార్యకర్త నోముల మురళి, హైదరాబాద్ లోని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి దృష్టికి తెచ్చారు. హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి పాత రికార్డులను శోధించి (సెర్చ్) చేసి మానువాడ నర్సయ్య చిరునామా కనుక్కొని, సంబంధిత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ల ద్వారా నివేదిక తెప్పించి బహరేన్ లోని ఇండియన్ ఎంబసీకి పంపిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఈ మేరకు ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి జులైలో సంబంధిత అధికారులకు 'ఎక్స్' ద్వారా ట్వీట్ చేశారు.

 

ఇంకా చదవండి: విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!

 

రైతులకు గుడ్ న్యూస్! ఈ పథకంలో రిజిస్టర్ అయితే రూ. 6 వేలు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి! ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే!

 

ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?

 

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?

 

బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!

 

ఏపీలో మహిళలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త! ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఖరారు! ఇప్పటికే చాలా జిల్లాల్లో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Bahrain #India #Case #Viralnews