ఖతార్ లో ఎన్టీఆర్ 101 వ జయంతి ఘనంగా వేడుకలు! భారీగా హాజరైన అభిమానులు! ఒక సంక్షోభంలో తెలుగువారు ఎలా ఐక్యంగా ముందుకెళ్లాలో..

Header Banner

ఖతార్ లో ఎన్టీఆర్ 101 వ జయంతి ఘనంగా వేడుకలు! భారీగా హాజరైన అభిమానులు! ఒక సంక్షోభంలో తెలుగువారు ఎలా ఐక్యంగా ముందుకెళ్లాలో..

  Wed Jul 17, 2024 20:46        Qatar

నందమూరి తారకరాముని 101 వ జయంతి వేడుకలు ఖతార్ లో ప్రవాసులు పెద్దఎత్తున నిర్వహించుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొన్నారు. ఈసందర్భంగా అయన సినీ రంగానికి చేసిన సేవ, రాజకీయాలలో అయన తీసుకొచ్చిన పెనుమార్పులు నేటి తరానికి వివరించే ప్రయత్నం చేసారు. ఎన్టీఆర్ పేరే.. సంచలనాలకు మారుపేరని, తెలుగు వాడిగా జన్మించడం పూర్వజన్మ సుకృతం అని అయన అనేవారని, నిజానికి తెలుగు వారి కీర్తిని దశ దిశలకూ వ్యాపింపచేసింది నందమూరి తారక రాముడిని గుర్తుచేసుకున్నారు. అయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. తెలుగు వారి గుండెల్లో అయన స్తానం పదిలమని చెప్పుకొచ్చారు. సమాజమే దేవాలయం .. పేదవాడే దేముడని.. బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాధికారం కట్టబెట్టిన మహనీయులు.. మానవసేవే మాధవ సేవ అని నిరూపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

 

ఇంకా చదవండి:  రోజా కనిపించని చెత్త.. అహంకారం! షాకింగ్ వీడియో వైరల్! చేసిన పనికి జగన్ కు తలనొప్పి!

 

ఇప్పటికి.. ఎప్పటికి.. ఎన్టీఆర్ అనే శబ్దం వింటేనే ఒకరకమైన వైబ్రేషన్స్ శరీరంలో వస్తాయని.. అంతటి ఘనకీర్తి అయన సొంతమని.. అయన కారనజన్ముడని గుర్తుచేసుకున్నారు. ఆయన తెలుగువారి స్థాయిని పెంచారని, ఆయన జీవిత చరిత్ర నేటి తరానికి ఆదర్శప్రాయమని పెద్దలు చెప్పుకొచ్చారు. ఆయన గురించి చెప్పటం ఒక పుటలోనో, ఒక రోజులో సాధ్యం కాదని.. వివరించారు. అయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు NDA తో జతకట్టి కనీ వినీ ఎరుగని రీతిలో విజయం సాధించిందని.. దానికి బీజం వేసిన వ్యక్తి, తెలుగువారి ఆరాధ్య దైవం.. తారకరాముడిని కొనియాడారు. ఒక సంక్షోభంలో తెలుగువారు ఎలా ఐక్యంగా ముందుకెళ్లాలో.. అవసరమైనప్పుడు తెలుగువారి వాడి వేడి ఎలా చూపెంచాలో నేర్పిన ఘనుడు అన్న ఎన్టీఆర్ అని, దాని ఫలమే యావత్ ప్రవాసులు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సమయంలో, తమ ఓటుహక్కుతో అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయుటలో కీలక భూమిక పోషించారని ఉద్ఘాటించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో చంద్రబాబుకు ప్రవాసులు  సహకరించాలని.. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని.. విదేశీ ఉద్యోగ కల్పనలలో తమవంతు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమాన్ని ఘనవిజయం చేసిన ప్రతివక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేసారు.



ఇంకా చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! అమరావతిపై ఢిల్లీ బిగ్ అప్డేట్ - గేమ్ ఛేంజర్! సీఆర్డీఏ కొత్త ప్రణాళికలు సిద్దం! ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం! పాఠశాలకు తాత్కాలికంగా మూడ్రోజులపాటు సెలవు!

 

అమెరికా జోరుగా సాగుతున్న తెలుగువారి హవా! ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు!

 

గుజరాత్ ను వణికిస్తున్న వైరస్! 8 మంది మృతి! హెచ్చరికలు జారీ!

 

ఏపీలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టుల నిర్మాణం! మంత్రి ట్వీట్!

 

విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పాత విధానం అమలు!

 

10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు! నోటిఫికేషన్ విడుదల! 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి!

 

ఆస్ట్రేలియా: కొంపముంచిన పిక్నిక్ ప్లాన్! నీటిలో కొట్టుకుపోయిన బాపట్ల మరియు కందుకూరు విద్యార్థులు.. ఒకరిని కాపాడపోయి ఇంకొకరు కూడా!

 

ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు... నీ సంగతేంటో చూస్తా! ఇప్పుడేం పీకుతావో - టీడీపీ నేత వార్నింగ్!

 

మీ దగ్గర రూ.500 నోట్లు ఉన్నాయా! అయితే ఒక సారి చెక్ చేసుకోండి! ఆ గుర్తు ఉంటే అవి నకిలీ నోట్లే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Qatar #101NTR #Celebrations