రఘురామ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు! జగన్ మోహన్ రెడ్డి నా ముందు బాలుడు.. కానీ పాముకు పాలు పోసి పెంచినట్టయిందని వ్యాఖ్య..
Sun Apr 21, 2024 10:33 Politicsనరసాపురం సిట్టింగ్ ఎంపీ, ఉండి అసెంబ్లీ స్థానం టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ప్రముఖ పాత్రికేయుడు జాఫర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తానెప్పటికీ రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ఎంపీ టికెట్టా, ఎమ్మెల్యే టికెట్టా అని ఎప్పుడూ చూడలేదని అన్నారు. జగన్మాయ వల్లే తనకు ఎంపీ టికెట్ రాలేదని భావిస్తున్నానని తెలిపారు..
జాఫర్: మీ నాలుకే మీ రాజకీయ జీవితానికి శాపంలా మారిందని అనుకోవచ్చా?
రఘురామ: బహుశా నాకు వరం అదే, శాపం అదే. నాకు బీజేపీ టికెట్ నిరాకరించింది. ఎందుకంటే.. జగన్ మోహన్ రెడ్డి అడ్డుపడ్డాడు.
జాఫర్: మీరు ఎంపీగా ఉండి, ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తున్నారు.. ఇది అవమానం అనుకుంటున్నారా?
రఘురామ: నేను దీన్నేమీ తిరోగమనంలా భావించడంలేదు. నాకు ఉండి అసెంబ్లీ సీటు ఖాయమైంది. చాలామంది అసెంబ్లీ సీటు రానివాళ్లు, ఏదో ఒకటిలే అని ఎంపీ సీటు అడుగుతున్నారు. నాకు ఎంపీయే కావాలని ఏపీలో అడిగినవాళ్లు లేరు.
జాఫర్: మోదీ, అమిత్ షా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మాట వినకుండా, ఏపీలో శత్రువర్గం అనదగ్గ వైసీపీ మాట విన్నారంటారా? మోదీ, అమిత్ షా కూటమి మాట కంటే, జగన్ మోహన్ రెడ్డి మాటకే విలువ ఇచ్చారంటారా?
రఘురామ: ఏమో.. అలాగేమైనా ఆలోచించారేమో.. నేనేమైనా మణులు అడిగానా, మాణిక్యాలు అడిగానా.. ఒక ఎంపీ సీటు అతడికి ఇవ్వొద్దనే కదా అడిగింది అని జగన్ వారిని కోరి ఉండొచ్చు.
జాఫర్: మోదీ, అమిత్ షాల వద్ద చంద్రబాబు స్ట్రాంగా, జగన్ స్ట్రాంగా, పవన్ కల్యాణ్ స్ట్రాంగా?
రఘురామ: కూటమి ఏర్పడిన తర్వాత ప్రస్తుతానికి చంద్రబాబే స్ట్రాంగ్.
జాఫర్: మరి చంద్రబాబు స్ట్రాంగ్ అయితే మీకు బీజేపీ ఎందుకు టికెట్ ఇవ్వలేదు?
రఘురామ: కొన్ని గత జన్మ వాసనలు ఉంటాయి. అవి ప్రభావం చూపించి ఉంటాయి.
జాఫర్: వైసీపీలో ఉన్నప్పుడు జగన్ ను, ఇతర నేతలను తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు, లోకేశ్ ల తీరు నచ్చకపోతే వారిని కూడా విమర్శిస్తారా?
రఘురామ: వారు ఆ విధంగా చేయరు. చంద్రబాబు నికార్సయిన పాలకుడు. నేను వారిపై మాట్లాడాల్సిన అవసరం కూడా రాదు. చంద్రబాబు వయసులో నాకన్నా పెద్దవారు. ఆయన ఏమన్నా గానీ ఆయనంటే నాకు గౌరవం ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి అనే వాడు నా ముందు బాలుడు. బాలుడు చాలా ఎక్ స్ట్రాలు మాట్లాడినప్పుడు ఒళ్లు మండింది. తప్పులు చేస్తున్నాడు కాబట్టి చెప్పాలనిపించింది.
జాఫర్: ఇదే జగన్ మోహన్ రెడ్డిని మీరు గుండెల్లో పెట్టుకున్నప్పుడు అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణపై స్టింగ్ ఆపరేషన్ చేశారు కదా.. కాల్ డేటా తీశారు కదా.. అదేమీ చిన్న విషయం కాదు.
రఘురామ: స్టింగ్ ఆపరేషనేమీ చేయలేదు. ఆ రోజు నా స్నేహితుడి కొడుకు అని భావించాను. కుర్రాడు ఇబ్బంది పడుతున్నాడు అని హెల్ప్ చేశాను. కానీ పాముకు పాలు పోసి పెంచినట్టయింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..
అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!
ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #RaghuRamaKrishnaRaju #TDP #Undi #Jagan #YSRCP #Jaffer #Interview #AndhraPradesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.