మంత్రిగా జీతం తీసుకోవడానికి మనస్కరించలేదు! ఎందుకంటే! డబ్బులు వెనకేసుకోవాలనే కోరిక..

Header Banner

మంత్రిగా జీతం తీసుకోవడానికి మనస్కరించలేదు! ఎందుకంటే! డబ్బులు వెనకేసుకోవాలనే కోరిక..

  Mon Jul 01, 2024 21:41        Politics

ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఊరేగింపులు జరుపుకోవడం తనకు ఇష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే నేడు నియోజకవర్గానికి వచ్చినట్లు తెలిపారు. ఈమేరకు పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పలువురు లబ్దిదారులకు పింఛన్లు అందజేశాక సభను ఉద్దేశించి ప్రసంగించారు. పిఠాపురం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ప్రభుత్వంలో తాను కీలక శాఖలు తీసుకున్నానని, వాటి అధ్యయనానికి, అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతోందని డిప్యూటీ సీఎం చెప్పారు.

 

ఇంకా చదవండి: కొత్త చట్టాలపై అమిత్ షా ఏమన్నారంటే! విపక్ష నేతలు అనవసర ఆరోపణలు!

 

మాటలు తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలన్నది తన అభిమతమని వివరించారు. పంచాయతీరాజ్ మంత్రిగా జీతం తీసుకుని పనిచేయాలని అనుకున్నా.. కానీ శాఖలో నిధులు లేవని పవన్ కల్యాణ్ చెప్పారు. అందుకే గత నెలకు సంబంధించిన నాలుగైదు రోజుల జీతానికి సంబంధించిన ఫైల్ పై సంతకం పెట్టడానికి మనస్కరించలేదని వివరించారు. తనకు జీతం ఏమీ వద్దని అధికారులకు చెప్పానన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియదని చెప్పారు. ఈ శాఖలో నిధులు లేకున్నా అప్పటి సీఎం మాత్రం రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడని విమర్శించారు. ఇదంతా చూశాక ప్రజలకు తాను మాట ఇస్తున్నానని.. పంచాయతీ రాజ్ శాఖలో తనవైపు నుంచి ఎలాంటి అవినీతికి తావుండదని స్పష్టం చేశారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

IND Vs SA T20 World Cup 2024! ఫైనల్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి!

 

టీ20 వరల్డ్ కప్ సెమీస్! IND vs ENG! వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ మొదలైంది!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

 

35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?

 

తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

 

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #PawanKalyan #AndhraPradesh #Dy.CMJanasena #Pensions #Kakinada #Pithapuram