కాకినాడలో డిప్యూటీ సీఎం సమీక్ష! ఈ విషయంలో ఎక్కడో ఒక చోట కదలిక మొదలవ్వాలి!

Header Banner

కాకినాడలో డిప్యూటీ సీఎం సమీక్ష! ఈ విషయంలో ఎక్కడో ఒక చోట కదలిక మొదలవ్వాలి!

  Tue Jul 02, 2024 16:49        Politics

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లాలో ఉన్న పరిస్థితులను అధికారులు మంత్రి పవన్ కల్యాణ్ కు వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, పంతం నానాజీ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిల ఆచూకీ లేదని, వారు ఎక్కడ ఉన్నారన్నది తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఓ బాలిక జమ్మూలో ఉన్నట్టు తెలిసిందని, 9 నెలల కిందట లవ్ ట్రాప్ తో ఆ అమ్మాయిని అపహరించినట్టు తెలిసిందని వివరించారు. బాలిక తల్లి తనను కలిసి భోరున విలపించిందని, తాను మాచవరం సీఐకి ఈ విషయం తెలియజేస్తే... వారు వెంటనే స్పందించి అద్భుతమైన రీతిలో పనితీరు కనబరిచారని పవన్ కల్యాణ్ కొనియాడారు. కొద్ది సమయంలోనే బాలిక ఆచూకీ తెలుసుకున్నారని వెల్లడించారు. ఇదే రీతిలో మిగతా కేసులను కూడా తీవ్రంగా పరిగణించి అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ నిర్దేశించారు.

 

ఇంకా చదవండి: ప్రైవేటు స్కూలు పైకప్పు కూలి విద్యార్థులకు గాయాలు! ఈ ఘటన తనను కలచివేసిందన్న లోకేశ్!

 

ఈ వ్యవహారంలో ఎక్కడో ఒక చోట కదలిక మొదలైతే తప్ప ఇది తీవ్రరూపం దాల్చదని అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓ అమ్మాయి అదృశ్యమై 24 గంటలు గడిస్తే, ఆ అమ్మాయి దొరకడం చాలా కష్టమని, ఆ అమ్మాయి సంగతి ఇక మర్చిపోవడమేనని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇక, 48 గంటలు గడిస్తే ఆ అమ్మాయిని ఎటు తీసుకెళతారో తెలియదు... బెంగళూరు తీసుకెళతారో, ఇంకెక్కడికి తీసుకెళతారో తెలియదు... ఇలాంటి విషయాల్లో పోలీసులు కూడా ఒక్కోసారి నిస్సహాయంగా మారిపోతుంటారని వివరించారు. అయితే, ఏపీ పోలీసులను మాత్రం ఈ విషయంలో అభినందించాలని, ఓ అమ్మాయి అదృశ్యమైన 9 నెలల తర్వాత కూడా ఆచూకీ తెలుసుకోగలిగారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. హేట్సాఫ్ టు ఏపీ పోలీస్ అని వ్యాఖ్యానించారు. ఇంతమంది ఆడపిల్లలు రాష్ట్రంలో అదృశ్యమైపోతే దీనిపై ఎందుకు స్పెషల్ కమిటీ ఏర్పాటు చేయకూడదు అనే అంశాన్ని రాష్ట్ర క్యాబినెట్ దృష్టికి తీసుకెళతానని వెల్లడించారు. పోలీసు అధికారులతో మాట్లాడి దీనిపై ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంపై ఆలోచిస్తామని చెప్పారు.

 

ఇంకా చదవండి: చంద్రబాబు ఇంటి స్థలం కొలవడానికి లంచం! డిప్యూటీ సర్వేయర్ సస్పెన్షన్! చివరికి ఏమైందంటే..?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

IND Vs SA T20 World Cup 2024! ఫైనల్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి!

 

టీ20 వరల్డ్ కప్ సెమీస్! IND vs ENG! వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ మొదలైంది!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

 

35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?

 

తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

 

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #PawanKalyan #Review #Kakinada #Janasena #TDP-JanaSena-BJPAlliance #AndhraPradesh