బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం! క్లారిటీ ఇచ్చిన గులాబీ పార్టీ!

Header Banner

బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం! క్లారిటీ ఇచ్చిన గులాబీ పార్టీ!

  Sat Jul 13, 2024 16:35        Politics

బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే టార్గెట్ గా అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపి వరుస పెట్టి గులాబీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుండగా.. మరోవైపు బీఆర్ఎస్ రాజ్య సభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నారంటూ తెలంగాణ పాలిటిక్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై గులాబీ పార్టీ రాజ్య సభ ఎంపీలు స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తున్నారంటూ వస్తోన్న వార్తలను వారు ఖండించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ ఎంపీ సురేష్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు ఊహాజనితమని కొట్టిపారేశారు. బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేస్తున్నారంటూ జరుగుతోన్న ప్రచారం అవాస్తవమన్నారు. తప్పుడు వార్తలతో బీఆర్ఎస్పై బురద జల్లుతున్నారని మరో ఎంపీ గాయత్రి రవిచంద్ర అసహనం వ్యక్తం చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

కాగా, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలుకావడంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కీలక నేతలు పక్క దార్లు చూస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకోగా.. త్వరలోనే మరి కొందరు సైతం వీరి బాటలోనే నడవనున్నట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసల ప్రవాహానికి అడ్డుకుట్టే వేసేందుకు నేరుగా గులాబీ కేసీఆర్ రంగంలోకి దిగిన ఫలితం లేకుండా పోతుంది. కేసీఆర్ బుజ్జగించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం గులాబీ బాస్ మాట లెక్కచేయకుండా అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీలు సైతం గులాబీకి గుడ్ బై చెప్పి కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీ గూటికీ చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి. హై కమాండ్ వ్యూహాంలో భాగంగానే బీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీలు కాషాయ పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనంనపై గులాబీ పార్టీ ఎంపీలు పై విధంగా రియాక్ట్ అయ్యారు. దీంతో బీజేపీలో బీఆర్ఎస్ మెర్జ్ వార్తలకు తెర పడింది.

 

ఇవి కూడా చదవండి  

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తో కాంట్రవర్సీ! లావణ్య సంచలన నిర్ణయం! 

 

నవయుగ ధర్మరాజు చంద్రబాబు! రాష్ట్ర ప్రగతి ఆయతోనే సాధ్యం! అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు వ్యాఖ్యలు! 

 

రెండేళ్లుగా ఉన్న సమస్యను 24 గంటల్లో పరిష్కరించిన మంత్రి లోకేష్! ఇది కదా ప్రజాస్వామ్యం అంటే! 

 

నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! 

 

రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ సంస్థలకు బాధ్యతలు! 

 

ఏపీ లో అధ్వాన్నంగా ఉన్న రోడ్డులపై సీఎం చంద్రబాబు దృష్టి! అధికారులకు కీలక ఆదేశాలు! 

 

పంచాయతీ రాజ్ శాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం! డిప్యూటీ సీఎం హామీ! 

 

సైకో జగన్ పై హత్యాయత్నం కేసు నమోదు! డాక్టర్ ప్రభావతి తోపాటు మరో ముగ్గురు పై కూడా! RRR కంప్లైంట్ పై కేసు ఫైల్ చేసిన పోలీసులు! 

                  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #AndhraPradesh #Telangana #BRS #Congress