విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!

Header Banner

విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!

  Thu Aug 22, 2024 19:00        Politics

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ముఖ్యంగా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏకపక్ష విజయాలు కైవసం చేసుకున్న స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ప్లేటు ఫిరాయించేస్తున్నారు. ఇప్పటికిప్పుడు వీటితో ఎలాంటి ఉపయోగం లేకపోయినా ఫిరాయింపుల పర్వం మాత్రం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఇవాళ విజయవాడ వైసీపీ కార్పోరేటర్లు టీడీపీలో చేరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మూడు డివిజన్ల వైసీపీ కార్పోరేటర్లు ఎంపీ కేశినేని శివనాధ్ సమక్షంలో పచ్చ కండువా కప్పుకున్నారు. వీరిలో మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షద్ ఉన్నారు.

 

ఇంకా చదవండి: కంపెనీలు బాధ్యత తీసుకోకుండా ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు! ఫార్మా కంపెనీలో ప్రమాద ఘటన!

 

వీరంతా బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు కావడం విశేషం. ప్రస్తుతం కార్పోరేషన్ లో వైసీపీ మేయర్ ఉన్న నేపథ్యంలో వీరి చేరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. అప్పటి నుంచీ కార్పోరేషన్ లో వైసీపీ ఆధిపత్యమే సాగుతోంది. అయితే తాజాగా విజయవాడ కార్పోరేషన్ స్థాయీ సంఘం ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో కూటమి సర్కార్ కార్పోరేటర్లపై ఫోకస్ పెట్టింది. దీంతో ఇవాళ ముగ్గురు కార్పోరేటర్లు టీడీపీలో చేరారు. త్వరలో మరికొందరు వైసీపీ కార్పోరేటర్లను కూడా చేర్చుకునేందుకు కూటమి పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. అయినా వచ్చే ఏడాది వరకూ కార్పోరేషన్ ను చేజిక్కించుకోవడం అయితే కష్టమే.

ఇంకా చదవండి: కొత్త రేషన్ కార్డులు.. కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! దరఖాస్తు ఆ నెలలో ముగియనుంది!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!

 

ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!

 

మా రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్, ఆయనే మాకు హీరో, మంత్రి భరత్! కరోనా వైరస్ మహమ్మారి తాండవం!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌! వెలుగులోకి మ‌రో సంచ‌ల‌న విష‌యం!

 

అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!

 

తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!

 

ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్‌క‌తా హ‌త్యాచార ఘ‌ట‌న‌పై విజ‌య‌శాంతి ట్వీట్‌!

అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!

 

18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!

 

విజయ్ సాయి రెడ్డి కుటుంబ సభ్యులు ఘోర పరాజయం! టిడిపి ఎంపీ ఏకగ్రీవంగా ఎన్నిక! సెప్టెంబర్ 8న అధికారికంగా!

 

కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!

 

అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?

 

రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples