ఏపీ గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కి మీరు అర్హులా! అయితే ఇప్పుడే అప్లై చేయండి! మీ లైఫ్ సెటిల్ చేసుకోండి!

Header Banner

ఏపీ గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కి మీరు అర్హులా! అయితే ఇప్పుడే అప్లై చేయండి! మీ లైఫ్ సెటిల్ చేసుకోండి!

  Sun Aug 25, 2024 08:00        Politics

పిఎం విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధిపొందేందుకు గ్రామ/వార్డ్ సచివాలయం, సి. యస్. సి సెంటర్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రారంభించిందని, కేవలం 5 శాతం వడ్డీకే రూ.3 లక్షల వరకు లోన్ అందించే పథకం 2023 సెప్టెంబర్ 17 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారని, స్కీమ్ ద్వారా లబ్ది పొందేందుకు వృత్తుల వారు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా కలెక్టర్ వివరించారు. సంప్రదాయ చేతి వృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పీఎం విశ్వకర్మ యోజన అందుబాటులోకి తీసుకొచ్చిందని, . స్కీమ్ 2023-24 నుంచి 2027-28 వరకు అయిదేళ్ల పాటు అమలులో ఉంటుందని అన్నారు. గురు- శిష్య వారసత్వ పరంపరను ప్రోత్సహించి, సంప్రదాయ పని ముట్లను, చేతులను ఉపయోగించి పని చేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడమే పథకం ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం తెలిపిందన్నారు.

 

ఇంకా చదవండి: డీఎస్పీపై హత్యాయత్నం, సోమిరెడ్డి తీవ్ర విమర్శలు! గంజాయి ముఠా వెనుక భారీ కుట్ర ఉందా?

 

చేతి పనుల వారు, కళాకారులు చేసే ఉత్పత్తుల నాణ్యతను పెంచడం, వారిని దేశీయ, గ్లోబల్ మార్కెట్తో అనుసంధానించడం స్కీమ్ వెనుకున్న మరో ముఖ్య ఉద్దేశమని ప్రకటించిందన్నారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన ద్వారా కళాకారులు, చేనేత కార్మికులకు పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్తో పాటు గుర్తింపు కార్డును అందిస్తారని, కేవలం 5 శాతం వడ్డీతో తొలి విడత కింద రూ.1లక్ష వరకు, రెండో విడత కింద రూ. 2లక్షల రుణం అందిస్తారని, ఇది ఇతర లోన్లతో పోలిస్తే చాలా తక్కువని వడ్డీ అన్నారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కళాకారులు, చేతి వృత్తుల వారికి స్కీమ్ వర్తిస్తుందని, అందులో తొలుత సంప్రదాయ వృత్తులైన వడ్రంగి, స్వర్ణకారులు, కుమ్మరి, కమ్మరి, శిల్పులు, రాతి పని చేసే వారు, చెప్పులు తయారు చేసేవారు, మేసన్, తాపీ పని, బుట్టలు, చాపలు, చీపుర్లు, తాళ్లు అల్లేవారు, సంప్రదాయకంగా బొమ్మలు తయారు చేసేవారు, క్షురకులు, పూలదండలు చేసేవారు, లాండ్రీ , చేపల వలలు తయారు చేసేవారు, సుత్తి- పనిముట్లు తయారు చేసేవారు, తాళాలు తయారు చేసేవారికి పథకం అందనుందన్నారు.

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు న్యూస్ కూడా నచ్చవచ్చు:


కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బంపర్ ఆఫర్! గెలిస్తే రూ.50 లక్షలు మీవే!
 

 

అతడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే! జగన్ పై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు! 

 

ఎయిర్ ఇండియాకు భారీ షాక్ ఇచ్చిన DGCA! ఏకంగా రూ.98 లక్షల జరిమానా! 

 

ఎన్నికల వేళ ట్రంప్, కమలా హారిస్ అరెస్ట్! వైరల్ అవుతున్న వీడియో! 

 

అనిల్ అంబానీ సహా 24 సంస్థలపై సెబీ చర్యలు! రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కుంభకోణం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #APNews #Chandrababu #Appeoples #freeMoney #Modi #APGovernment