వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం! రాష్ట్రమే ఫస్ట్... ప్రజలే ఫైనల్! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

Header Banner

వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం! రాష్ట్రమే ఫస్ట్... ప్రజలే ఫైనల్! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

  Thu Dec 12, 2024 15:01        Politics

రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్' అనే నినాదంతో ముందుకెళ్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రభుత్వ పాలనలో ఆరునెలలు గడిచిందన్నారు. నిర్బంధం, సంక్షోభం, అభద్రతలో గడిచిన ఐదేళ్ల కాలాన్ని ప్రజలు ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పారు. ఈ మేరకు 'ఎక్స్'లో ఆయన పోస్ట్ చేశారు. "బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలు, ఆకాంక్షలను తీర్చేందుకు నాతో పాటు మంత్రివర్గ సహచరులంతా కృషి చేస్తున్నారు. ఈ ఆరు నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దాం. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం. చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తెరిగి.. ప్రణాళికతో ముందుకువెళ్తున్నాం. మీ ఆశీస్సులు, భాగస్వామ్యంతో.. 'స్వర్ణాంధ్ర - 2047' విజన్ ఆంధ్రప్రదేశ్ను నంబర్ 1గా నిలబెడతాం”అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.



ఇంకా చదవండినల్లపాడులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ ఘటన కలకలం! డబ్బులు డిమాండ్ చేసిన వైకాపా నేత.. ఎంతో తెలిస్తే షాక్!



పబ్లిసిటీ కంటే రియాలిటీకే ప్రాధాన్యం: నారా లోకేశ్
రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈమేరకు ఆయన 'ఎక్స్' వేదికగా పోస్టు చేశారు. "ఐదేళ్లలో విధ్వంసమైన రాష్ట్రం, అస్తవ్యస్తమైన వ్యవస్థలు, అప్పులు వారసత్వంగా వచ్చాయి. సంక్షోభాలను అవకాశాలుగా, సంక్షేమంగా మలిచే చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచీ రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తోంది. పిచ్చిపిచ్చి రంగులు ఉండవు.. మా బొమ్మలు కనిపించవు.. పబ్లిసిటీ కంటే రియాలిటీకే మా ప్రాధాన్యం. రాష్ట్రమే ఫస్ట్... ప్రజలే ఫైనల్ అనే నినాదం కూటమి ప్రభుత్వ విధానంగా అమలు చేస్తున్నాం. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం” అని లోకేశ్ పేర్కొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?

 

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!

 

మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..

 

ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

 

 గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌! నెటిజన్లు ఎక్కువగా ఏమి వెతికారో తెలుసా? పవన్ కల్యాణ్ స్థానం ఎంతంటే?

 

వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!

 

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

 

నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదలఎప్పుడు అంటే?

 

 

నేడు (11/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #CBN #APCM #andhrapradesh #development #todaynews #flashnews #latestupdate