గుడ్ న్యూస్.. ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి కీలక ప్రకటన! వేలల్లో ఉద్యోగావకాశాలు!

Header Banner

గుడ్ న్యూస్.. ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి కీలక ప్రకటన! వేలల్లో ఉద్యోగావకాశాలు!

  Mon Dec 30, 2024 07:00        Politics

కాంట్రాక్టు వ్యవస్థనే జగన్ ప్రభుత్వం చంపేసిందని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఏపీకి పది లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు. ప్రతి నిమిషానికి ఆర్ధిక పరిస్థితులు బేరీజు వేసుకుని పాలన చేయాల్సి వస్తోందని అన్నారు. ఏడు శాతం అప్పులు చేసి జీతాలు చెల్లిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి ఆదాయం ఇచ్చేది కాంట్రాక్టర్లే అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం 93 కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేసిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 74 కేంద్ర ప్రభుత్వం పథకాలను రివైండ్ చేశామని... త్వరలో మరికొన్ని చేస్తామని తెలిపారు. ఆర్సల్ మిట్టల్ కంపెనీ సీఎం చంద్రబాబును నమ్మి లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. పెద్ద పెద్ద కంపెనీలకే ఆర్ధిక శాఖ పేమెంట్‌లు చెల్లిస్తుందనే అపవాదు ఉందని చెప్పారు. ప్రియారిటీ ప్రకారం అన్ని కంపెనీలకు బిల్లులు చెల్లిస్తామని ప్రకటించారు. ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే 25 ఏళ్ల ఆదాయాన్ని జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లను దోపిడీ దారులుగా చేసుకుందని విమర్శలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో కాంట్రాక్టర్లను భాగస్వాములుగా చేస్తుందని అన్నారు. దీపావళి పండుగకు కొంతమంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించామని స్పష్టం చేశారు.

 

ఇంకా చదవండి: ఏపీలో పెట్రేగిపోతున్న ట్రోలింగ్.. బొత్స కాళ్లు నేనెందుకు పట్టుకుంటాను? క్లారిటీ ఇచ్చిన మంత్రి!

 

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పంచాయతీ నిధులను వైసీపీ ప్రభుత్వం కాజేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పంచాయతీలకే కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంలో బిల్లులు రాక అప్పుల పాలై 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఓ కాంట్రాక్టర్‌నని.. తనకు జగన్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా తనపై కక్షగట్టిందని చెప్పారు. గత ఐదేళ్లలో జగన్ దుర్మార్గపు పాలన చేశారని ఆరోపించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తాను పలు పనులు చేశానని గుర్తుచేశారు. చంద్రబాబు హయంలో వర్క్స్ చేశారు కాబట్టి ఆయన్నే బిల్లులు అడగాలని వైసీపీ పెద్దలు తనను హీనంగా మాట్లాడారని వాపోయారు. పార్టీ మారితే బిల్లులు మంజూరు చేస్తామని వైసీపీ పెద్దలు తనపై వత్తిడి చేశారన్నారు. అయినా తాను పార్టీ మారలేదని చెప్పారు. జగన్ ప్రభుత్వం మంజూరు చేయకున్నా వర్క్స్ పూర్తి చేశానని తెలిపారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి మాటలు నమ్మి కొంతమంది కాంట్రాక్టర్లు వైసీపీలో చేరారని.. వారికి నేటికీ వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!

 

వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్, డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

 

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

 

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews