ఏపీలో రైలు ప్రయాణికులకు అలర్ట్! జనవరి 1 నుంచి పలు రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు!

Header Banner

ఏపీలో రైలు ప్రయాణికులకు అలర్ట్! జనవరి 1 నుంచి పలు రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు!

  Wed Jan 01, 2025 08:00        Politics

జనవరి 1వ తేదీ నుంచి వివిధ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చేర్పులు ఉంటాయని.. దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైల్వే సర్వీసులు మరింత మెరుగుపరచడానికి, ప్రయాణికులకు మరింత ఉత్తమంగా సేవలు అందించేందుకు ఈ మార్పులు తీసుకువస్తున్నట్లు తాజాగా దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు.. మారిన టైమింగ్స్‌ ఆధారంగా రైలు ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని హితవు పలికింది. ఇక విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ 5 నిమిషాల ముందుగానే బయల్దేరుతుందని ప్రకటించింది. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ స్టేషన్‌లో ఇక నుంచి 15 నిమిషాలు ముందుగానే విశాఖపట్నం స్టేషన్‌కు బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. గతంలో ఉన్న టైమింగ్స్ ప్రకారం విజయవాడ స్టేషన్‌లో రత్నాచల్ ఉదయం 6.15 గంటలకు బయలుదేరాల్సిన ఉండగా.. ప్రస్తుతం మారిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 6 గంటలకే విజయవాడ నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు.

 

ఇంకా చదవండి: ఏపీ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక బాధ్యతలు! ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

 

విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు నిత్యం భారీ సంఖ్యలో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించేవారు ఈ మార్పులను గమనించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు. మారిన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ఇక జనవరి 1వ తేదీ నుంచి ఎంఎంటీఎస్‌ రైళ్ల ప్రయాణ వేళల్లోనూ మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా 88 ఎంఎంటీఎస్‌ సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అనుసంధానం చేసేందుకు వీలుగా ఈ మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మారిన రైలు ప్రయాణ వేళలను నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్‌లో ప్రయాణికులు చూసుకోవచ్చని వెల్లడించింది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కోటప్పకొండను సందర్శించిన చంద్రబాబు! పల్నాడు జిల్లా యల్లమందలో..

 

ఐదు కోట్ల మంది ప్రజల కోసమే కష్టపడుతున్నా - సీఎం చంద్రబాబు! పర్యటనలో కీలక ప్రకటనలు!

 

ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ కు కొత్త చార్జీలు! ఎప్పటి నుంచి అంటే!

 

వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో 9 ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!

 

జగన్ అండదండలతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి! డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Modi #AndhraPradesh #APPolitics #NaraLOkesh #Chandrababu #ModiMeeting #Anakapalli