దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

Header Banner

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

  Tue Jan 07, 2025 07:00        Politics

ఎన్నికల ఫలితాలు వచ్చిన ఆరు నెలల్లోనే విశాఖ జిల్లాలో వైసీపీ పరిస్థితి తారుమారై పోయింది. ఐదేళ్లు అధికారంలో ఉండి, ఇప్పుడు నడిపించే నాయకుడు లేక చాలా నియోజకవర్గాల్లో బిత్తర చూపులు చూస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో భీమిలి, విశాఖ ఈస్ట్, గాజువాక, యలమంచిలి, పాయకరావుపేట, అనకాపల్లిలో.. నియోజకవర్గ వ్యవహారాలు చక్కబెట్టే ఇంచార్జ్‌లు లేరు. గతంలో ఈ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన నేతల్లో కొందరు పార్టీని వీడితే.. మరికొందరు ఎన్నికల్లో ఓటమి దెబ్బకు తేరుకోలేక రోడ్డు మీదకే రావడం మానేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి భీమిలిలో వైసీపీని నడిపించే నాయకుడు లేరు. అలాగే విశాఖ ఈస్ట్‌లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంవీవీ సత్యనారాయణ పార్టీని వీడలేదు. అలాగని యాక్టివ్‌గా లేరు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ్యాపార, వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. అలాగే గాజువాక నియోజకవర్గంలో పోటీ చేసిన ఓడిన గుడివాడ అమర్‌.. నియోజకవర్గాన్ని వదిలేశారు. అంతకుముందు ఇంచార్జ్‌గా ఉన్న తిప్పల నాగిరెడ్డి వయోభారంతో యాక్టివ్ కాలేకపోతున్నారు.

 

ఇంకా చదవండి: ప్రపంచంలోని టాప్ 10 చిన్న అంతర్జాతీయ విమాన మార్గాలు! అన్నీ 100 కిలోమీటర్ల లోపే!

 

అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగిన అనూహ్య పరిణామాలతో మలసాల భరత్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన పత్తా లేకుండా పోయారు. దీంతో అనకాపల్లి శ్రేణులకు నాయకుడు లేక క్యాడర్ అనాథలా మారింది. అలాగే పాయకరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గొల్ల బాబూరావు రాజ్యసభకు వెళ్లిపోయారు. ఎన్నికల్లో రాజాం నుంచి వచ్చి పోటీ చేసిన కంబాల జోగులు ఓటమి తర్వాత అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. స్థానికేతరుడు కావడంతో అప్పుడప్పుడు వస్తుపోతున్నారు తప్ప శ్రేణులకు అండగా ఉండటం లేదనే వాదన ఉంది. ఇక యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి కన్నబాబు రాజు ఓడిపోయారు. ఆయనకు వయోభారంతో యాక్టివ్‌గా లేరు. నియోజకవర్గంలో తనకు పట్టున్నందున తన కుమారుడు సుకుమార వర్మకు పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. ఇలా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇలా అరడజను నియోజకవర్గాలకు వైసీపీని నడిపించే నాథుడు కరువయ్యాడు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు, ఇబ్బందులకు గురవుతున్నారు. మరి జగన్ ఏం చేస్తాడో చూడాలి..

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

నేడు (6/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ప్రయాణికులకు శుభవార్త: మరో రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్.. ఈ ప్రాంతాలన్నింటికీ కొత్త రైల్వేస్టేషన్లు..

AP: రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన మహిళలకు అదిరే గుడ్ న్యూస్! కీలక ప్రకటన - ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు!

ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..

అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..

పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Jagan #Visakhapatnam #AndhraPradesh #APpolitics #MLS #MPS #Resign #JaganViral #News #APNews