అమిత్ షా, పురందేశ్వరి నేతృత్వంలో బీజేపీ కీలక సమావేశం! రాజకీయ పరిణామాలపై చర్చ!

Header Banner

అమిత్ షా, పురందేశ్వరి నేతృత్వంలో బీజేపీ కీలక సమావేశం! రాజకీయ పరిణామాలపై చర్చ!

  Sun Jan 19, 2025 13:42        Politics

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం ఆదివారం జరగనుంది. అమరావతి నోవాటెల్ హోటల్ 7వ అంతస్థులో జరగనున్న ఈ సమావేశంకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఇతర నాయకులు హాజరుకానున్నారు. ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ బలోపేతం, కేంద్ర సహాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటి అంశాల పైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం 10.15 నుండి 10.30కు హైందవ శంఖారావం సభ విజయవంతంగా నిర్వహించినందుకు విశ్వహిందూ పరిషత్ నాయకులతో అమిత్ షా ప్రత్యేక సమావేశం కానున్నారు.



ఇంకా చదవండిరోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి! రోజంత‌టికీ కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది! 



ఈ సమావేశానికి విశ్వహిందూ పరిషత్ నేతలు గోకరాజు గంగరాజు సహా మరో ఐదుగురు హాజరుకానున్నారు. నోవాటెల్ హోటల్లో అమిత్ షా కార్యక్రమాలు ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబుతో కలిసి ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. గన్నవరం మండలం కొండపావులూరులో నూతనంగా నిర్మించిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం), జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) 10వ బెటాలియన్ ప్రాంగణాలు కేంద్ర హోంమంత్రి ప్రారంభించనున్నారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #bjp #meeting #purndheswari #amithsha #todaynews #fllashnews #latestupdate