తెలంగాణ గల్ఫ్ కార్మికులకు శుభవార్త! త్వరలో వారి సంక్షేమానికి నాలుగు జీవోలు చేయనున్న ప్రభుత్వం! వారి కుటుంబాలకు పలు అంశాలలో ప్రాధాన్యత... 5 లక్షల వరకు..!

Header Banner

తెలంగాణ గల్ఫ్ కార్మికులకు శుభవార్త! త్వరలో వారి సంక్షేమానికి నాలుగు జీవోలు చేయనున్న ప్రభుత్వం! వారి కుటుంబాలకు పలు అంశాలలో ప్రాధాన్యత... 5 లక్షల వరకు..!

  Sat Sep 14, 2024 19:33        Gulf News

గల్ఫ్ బోర్డు, ఎన్నారై పాలసీపై ముందడుగు 

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల గురించి బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన శనివారం సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కన్వీనర్ గా ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.  

 

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సూచన మేరకు అందుబాటులో ఉన్న గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, నాయకులు, గల్ఫ్ వలసల నిపుణులు, అధికారులతో చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 'అభయ హస్తం' ఎలక్షన్ మేనిఫెస్టోలో ‘గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం' పేరుతో ఇచ్చిన నాలుగు హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పొన్నం ప్రభాకర్ అన్నారు. 

 

ఇంకా చదవండిరూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం (చొప్పదండి), డా. మాకునూరి సంజయ్ కుమార్ (జగిత్యాల), కెఆర్ నాగరాజు (వర్ధన్నపేట), డా. ఆర్. భూపతి రెడ్డి (నిజామాబాద్ రూరల్), జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, కార్పొరేషన్ చైర్మన్లు అనిల్ ఈరవత్రి, సుంకేట అన్వేష్ రెడ్డి, నాయకులు పి. వినయ్ రెడ్డి (ఆర్మూర్), కూచాడి శ్రీహరి రావు (నిర్మల్), వెలిచాల రాజేందర్ రావు (కరీంనగర్) వలస నిపుణులు అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ వలస కార్మిక నాయకులు మంద భీంరెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, స్వదేశ్ పరికిపండ్ల, లిజీ జోసెఫ్, ఫలియా, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఎన్నారై విభాగం అధికారి ఇ. చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిజగ్గయ్యపేటలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్! ప్రముఖ నేత టిడిపిలో చేరిక! మరికొంతమంది వైసీపీ నేతల మార్పు? 

 

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ముందుగా నాలుగు అంశాలపై ప్రభుత్వం జీఓలు తీయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

◉ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు 2023 డిసెంబర్ 7 నుంచి గల్ఫ్ దేశాలలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. 

◉ గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సలహా కమిటీ ఏర్పాటు చేయాలి. 

◉ హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రత్యేక 'ప్రవాసి ప్రజావాణి' కౌంటర్ ఏర్పాటు చేయడం. 

◉ గురుకుల పాఠశాల లలో, కళాశాల లలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు అడ్మిషన్లలో ప్రాధాన్యత కల్పించాలి. 

 

WhatsApp Image 2024-09-14 at 6.17.23 PM.jpeg

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఐఆర్‌సీటీసీ వెంకటాద్రి టూర్ ప్యాకేజీ.. అతి తక్కువ ఖర్చుతో 4 రోజుల తిరుమల యాత్ర! ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరకదు!

 

మద్యం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌! ఆ రెండు రోజులు వైన్స్‌ బంద్‌!

 

ఈ ఆరు దేశాల్లో వాట్సాప్‌పై నిషేధం! దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసా?

 

రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం! 77వేల మంది పదో తరగతి విద్యార్ధులకు!

 

చిన్న పరిశ్రమల నిర్వాహకులకు చంద్రబాబు గుడ్ న్యూస్! కేంద్ర ప్రభుత్వం ఈ నిధికి రూ.900 కోట్లు!

 

ఏపీతెలంగాణకు మళ్లీ భారీ వర్షాలు! పొంచి ఉన్న మరో ముప్పు..! ఆ జిల్లాలకు అలర్ట్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 

 


   #AndhraPravasi #Gulf #GulfNews #TeluguMigrants #IndianMigrants