క్రెడిట్‌ కార్డు వాడేవారికి అలర్ట్.. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

Header Banner

క్రెడిట్‌ కార్డు వాడేవారికి అలర్ట్.. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

  Sun Sep 01, 2024 11:00        Business

ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు తీసుకొనే ఆర్థిక పరమైన నిర్ణయాలు, ప్రభావాలు తెలుసుకోవడం చాలా కీలకం. ఆయా పాలసీలు, సేవల్లో తీసుకొచ్చే మార్పులు మన ఖర్చులు, పొదుపులపై నేరుగా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డు అప్‌డేట్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం దాదాపు అన్ని రకాల పేమెంట్లకు క్రెడిట్‌ కార్డులు వినియోగిస్తున్నారు. ఛార్జీలు, పెనాల్టీలు, రివార్డులు, పేమెంట్‌ సైకిల్‌లో వచ్చే చిన్న మార్పులు కూడా కీలకం. అయితే సెప్టెంబర్‌ 1 నుంచి కొన్ని క్రెడిట్‌ కార్డు రూల్స్ మారుతున్నాయి. వచ్చే నెల నుంచి వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డు హోల్డర్లకు కొత్త నియమాలు అమల్లోకి వస్తాయి. రివార్డ్ పాయింట్లు, రీడీమ్ చేయడం, పేమెంట్ గడువులు, మినిమం బ్యాలెన్స్‌పై ప్రభావం చూపుతాయి. ఆధార్ అప్‌డేట్స్, జీఎస్టీ ఫైలింగ్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లకు సంబంధించి కూడా మార్పులు రాబోతున్నాయి.

రూపే క్రెడిట్ కార్డులకు మరిన్ని రివార్డ్ పాయింట్లు: 2024 సెప్టెంబర్ 1 నుంచి రూపే క్రెడిట్ కార్డు హోల్డర్లు కొత్త రివార్డ్ పాయింట్ సిస్టమ్ నుంచి ప్రయోజనం పొందుతారు. రూపే క్రెడిట్ కార్డులు ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఇతర పేమెంట్‌ సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగానే రివార్డ్ పాయింట్లు పొందుతాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది.

 

ఇంకా చదవండి: పెట్రోల్, డీజిల్‌ ఖర్చులను తగ్గించే క్రెడిట్ కార్డ్.. ఇంకా బోలెడు బెనిఫిట్స్! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రివార్డ్ పాయింట్లపై లిమిట్‌  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రివార్డ్ పాయింట్లపై కొత్త పరిమితులను ప్రవేశపెట్టనుంది. యుటిలిటీ, టెలికాం ట్రాన్సాక్షన్ల నుంచి మీరు నెలకు అత్యధింగా 2,000 పాయింట్లు మాత్రమే పొందగలరు. అదనంగా క్రెడ్‌ (CRED), చెక్‌ (CheQ), మొబిక్విక్‌ (MobiKwik) వంటి థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కి చేసిన పేమెంట్స్‌పై ఇక రివార్డ్‌ పాయింట్లు లభించవు. అయితే మీరు విద్యా సంస్థలకు వారి వెబ్‌సైట్‌లు లేదా POS మెషీన్ల ద్వారా నేరుగా పేమెంట్‌ చేస్తే రివార్డ్‌ పాయింట్లు సంపాదించవచ్చు. ఈ మార్పులు స్విగ్గీ (Swiggy), టాటా న్యూ (Tata Neu) వంటి కో-బ్రాండెడ్, ప్రీమియం కార్డులు సహా అన్ని హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులకు వర్తిస్తాయి.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్ పేమెంట్‌ అడ్జస్ట్‌మెంట్లు: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పేమెంట్ రూల్స్ సెప్టెంబర్ నుంచి మారుతున్నాయి. క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్ జనరేట్‌ అయిన తర్వాత, పేమెంట్‌ డ్యూ డేట్‌ 18 రోజుల నుంచి 15 రోజులకు తగ్గుతుంది. అంటే బిల్లు పే చేయడానికి అందుబాటులో ఉండే రోజుల్లో మూడు రోజులు తగ్గిపోయాయి. అలానే మినిమం డ్యూ అమౌంట్‌ (MAD), ప్రిన్సిపుల్‌ అమౌంట్‌లో 5% నుంచి 2%కి తగ్గుతుంది. మొత్తం బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఈ మార్పు సహాయపడుతుంది.

రాబోయే ఇతర మార్పులు: ఆధార్ డాక్యుమెంట్ అప్‌డేట్: ఉచితంగా ఆధార్ డాక్యుమెంట్ అప్‌డేట్‌ చేసుకునే గడువు 2024 సెప్టెంబర్ 14తో పూర్తవుతుంది. ఆ తర్వాత ఆధార్‌ అప్‌డేట్‌ చేయాలనుకుంటే ఛార్జీలు వర్తించవచ్చు.

జీఎస్టీ ఫైలింగ్ రిక్వైర్‌మెంట్స్‌: సెప్టెంబర్ నుంచి జీఎస్టీ ట్యాక్స్‌ చెల్లింపుదారులు రిజిస్టర్‌ చేసిన 30 రోజుల్లోపు వ్యాలిడ్‌ బ్యాంక్ డీటైల్స్‌ అందించాలి. ఎలాంటి పెనాల్టీలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ గడువులోపు పని పూర్తి చేయాలి.

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు: నిర్దిష్ట వివరాలపై ఇంకా స్పష్టత లేనప్పటికీ, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో కూడా మార్పులు ఉండవచ్చు.

 

ఇంకా చదవండి: రఘురామ టార్చర్ కేసులో జగన్ కు పిలుపు? అప్పట్లో సీఐడీ కస్టడీలో..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!

 

జగన్ అడ్డాలో ఇసుక దందా,జిల్లా ఎస్పీ సీరియస్! నేరుగా నదిలోకి వెళ్లి? ఇంత జరిగినా కూడా బుద్ధి పోనిచ్చుకోలేదు!

 

మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

 

రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!

 

ఆస్ట్రేలియా: 24/7 అందుబాటులోకి రానున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం! సిడ్నీ వాసులకు అన్ని సౌకర్యాలతో అన్ని ప్రాంతాలకి! మొదటి ఎయిర్ వేస్ ఏది అంటే!

 

ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

 

ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!

 

జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?

 

వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!

 

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!

 

అది ఎన్నారైల కోసమేనా? అన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ!

 

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Creditcard #Bank #Month #September #NewRules