బ్యాంక్ కస్టమర్లకు కీలక అప్‌డేట్! వరుసగా ఆరు రోజులు సెలవులు!

Header Banner

బ్యాంక్ కస్టమర్లకు కీలక అప్‌డేట్! వరుసగా ఆరు రోజులు సెలవులు!

  Fri Sep 13, 2024 13:27        Business

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ, స్థానిక సందర్భాలు, మతపరమైన వేడుకలు, ఇతర సాంస్కృతిక ఆచారాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకుల సెలవుల జాబితాను నిర్ణయిస్తుంది. 

 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్ హాలిడేస్‌ను ముందుగానే ప్రకటిస్తుంది. బ్యాంక్ కస్టమర్లు ఇబ్బందులు పడకుండా తమ బ్యాంకు పనులు షెడ్యూల్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ వారం, తర్వాతి వారంలో ప్రాంతీయ సెలవులు, పండుగలు, వీకెండ్‌ కలిసి వరుసగా బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. అంటే భారతదేశంలోని కొన్ని బ్యాంకులు సెప్టెంబర్ 13 నుంచి 18 మధ్య వరుసగా ఆరు రోజులు మూతపడతాయి. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకేలా సెలవులు పాటించరు. కాబట్టి బ్యాంకు హాలిడే షెడ్యూల్ కోసం స్థానిక బ్యాంక్ బ్రాంచ్ లేదా యాప్‌ను విజిట్ చేయడం మంచిది. మొత్తం మీద భారతదేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 2024 సెప్టెంబర్‌లో కనీసం 14 రోజుల పాటు క్లోజ్‌లో ఉంటాయి. 

 

ఇందులో మతపరమైన, ప్రాంతీయ పండుగలతో పాటు రెండు నాలుగో శనివారాలు, ఆదివారాలు, వారాంతపు సెలవులు కూడా ఉంటాయి. మీకు బ్యాంక్‌లో ఏవైనా పనులుంటే, సెలవులు తెలుసుకొని, ఆ ప్రకారం ప్లాన్ చేసుకోవడం మంచిది. 

 

ఇంకా చదవండిమాజీ మంత్రికి మరింత బిగుస్తున్న ఉచ్చు! ఏసీబీ పిటీషన్లపై విచారణ వాయిదా!

 

ప్రస్తుతం చాలా రకాల బ్యాంక్‌ సేవలు సెలవు రోజుల్లో కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించుకోవచ్చు. ప్రతి బ్యాంకు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు, మొబైల్ బ్యాంకింగ్ సేవల యాప్‌లను అదుబాటులోకి తీసుకొచ్చాయి. అత్యవసరాలకు ఏటీఎం నుంచి క్యాష్‌ విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఏటీఎం విత్‌డ్రాపై పరిమితులు ఉంటాయి. 

 

వరుసగా బ్యాంకులకు సెలవులు
సెప్టెంబర్ 13: రామ్‌దేవ్ జయంతి/ తేజ దశమి (శుక్రవారం) - రాజస్థాన్
సెప్టెంబర్ 14: రెండో శనివారం/ ఓనం - భారతదేశం అంతటా/కేరళ
సెప్టెంబర్ 15: ఆదివారం/ తిరువోణం - భారతదేశం అంతటా/కేరళ
సెప్టెంబర్ 16: ఈద్-ఎ-మిలాద్ (సోమవారం)- భారతదేశం అంతటా
సెప్టెంబర్ 17: ఇంద్ర జాతర (మంగళవారం) - సిక్కిం
సెప్టెంబర్ 18: శ్రీ నారాయణ గురు జయంతి (బుధవారం) - కేరళ 

 

ఇంకా చదవండిటోల్ గేట్లలో కీలక మార్పులు! ఇక ఆ వాహనదారులకు చార్జీలు ఉండవు!

 

ఇవి కాకుండా, కొన్ని రాష్ట్రాల్లో సెప్టెంబర్ 21 (శ్రీ నారాయణ గురు సమాధి - కేరళ), సెప్టెంబర్ 22 (ఆదివారం - దేశం మొత్తం), సెప్టెంబర్ 23 (వీరుల అమరవీరుల దినోత్సవం - హర్యానా) ఉంటాయి. నెల చివరిలో నాలుగో శనివారం, నెలలో చివరి ఆదివారం కారణంగా సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో కూడా బ్యాంకులు పని చేయవు. ఇప్పటికే సెప్టెంబర్ 1 (ఆదివారం), సెప్టెంబర్ 7 (గణేష్ చతుర్థి), సెప్టెంబర్ 8 (ఆదివారం) బ్యాంకులు పని చేయలేదు.  

 

సెంట్రల్ బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు నోటిఫికేషన్‌ల ద్వారా ప్రకటన చేస్తుంది. చెక్‌లు, ప్రామిసరీ నోట్ల జారీకి సంబంధించిన నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం బ్యాంక్ వార్షిక సెలవు క్యాలెండర్ మొత్తం ఆర్‌బీఐ ప్రకటిస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్ - అదీ వదలొద్దని ఆదేశం! ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో!

 

కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి కీల‌క ప‌ద‌వి! త‌న‌కు ద‌క్కిన ఈ అరుదైన గౌర‌వం!

 

18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!

 

ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!

 

ఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి! 

 

గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదుబిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 7

 

గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వసాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!

 

గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Business #Banks #Holidays #India #AndhraPradesh #AP #Telangana #TG