గెలుపుకి కారణమైన మలుపు! బంతిని ఇలా కూడా పట్టుకోగలుగుతారా? బ్రిలియంట్ సూర్యకుమార్ యాదవ్!

Header Banner

గెలుపుకి కారణమైన మలుపు! బంతిని ఇలా కూడా పట్టుకోగలుగుతారా? బ్రిలియంట్ సూర్యకుమార్ యాదవ్!

  Sun Jun 30, 2024 12:43        Sports

టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ తొలి బంతికి సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద సూపర్ మ్యాన్‌లా పట్టిన క్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. క్రీజులో పాతుకుపోయిన సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్, డేంజరస్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ఔట్ కావడంతో భారత్ పుంజుకొని చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. అయితే బౌండర్ రోప్ వద్ద సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు సంబంధించి సోషల్ మీడియా వేదికగా తాజా వీడియో ఒకటి వైరల్‌గా మారింది. బాగా జూమ్ చేసి ఉన్న ఈ వీడియోలో సూర్యకుమార్ యాదవ్ కాలు బౌండరీ రోప్‌ను తాకిందని దక్షిణాఫ్రికా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

 

ఇంకా చదవండి: టీ20 వరల్డ్ కప్ సెమీస్! IND vs ENG! వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ మొదలైంది!

 

ఔట్‌ అని నిర్ధారించడానికి ముందు థర్డ్ అంపైర్లు మరింత జాగ్రత్తగా చెక్ చేసి ఉండాల్సిందని అంటున్నారు. అది ఔట్ కాదు.. సిక్సర్ అంటూ ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. భారత్ కేవలం 7 పరుగుల తేడాతో గెలిచిందని, దీనిని సిక్స్‌గా పరిగణనలోకి తీసుకొని ఉంటే మ్యాచ్ ఫలితం మారిపోయేదేమోనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి అంశాలు మ్యాచ్ ఫలితాలను మార్చివేస్తాయని చెబుతున్నారు. కాగా సూర్య కుమార్ యాదవ్ అందుకున్న క్యాచ్‌ను పలు కోణాల్లో పరిశీలించిన అనంతరమే థర్డ్ అంపైర్లు.. డేవిడ్ మిల్లర్ ఔట్ అయినట్టుగా ప్రకటించారు. ఈ నిర్ణయం భారత జట్టుకు అనుకూలంగా మారిన విషయం తెలిసిందే. ఇక సూర్య అద్భుత క్యాచ్‌పై భారత ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ స్పందిస్తూ... సూర్య ఇలాంటి 50 క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశాడని వెల్లడించారు. బౌండరీ రోప్‌పై సూర్యకు అవగాహన ఉందని, బంతిని అందుకున్నాక తిరిగి మైదానంలోకి విసిరి దానిని పట్టుకోగలననే విశ్వాసం గల ఆటగాడు సూర్య అని కితాబిచ్చాడు.

 

ఇంకా చదవండి: IND Vs SA T20 World Cup 2024! ఫైనల్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

స్టేట్ స్పాన్సర్డ్ టెర్రిరిజం పై ఫోకస్ పెట్టిన కూటమి! పాత కేసుల ఫైళ్లకు బూజు దులుపుతోన్న పోలీస్! ఇక ఒక్కొక్కడి ప్యాంటు తడిసిపోవాల..

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

 

మీరు నమ్మాల్సిందే! ఇది అయోధ్య.. వైరల్ అవుతున్న న్యూస్! దారుణంగా రామాలయ పరిసర ప్రాంతాలు!

 

35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?

 

తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

 

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!

 

ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న టాప్ పది దేశాలు! మొదటి స్థానంలో అమెరికా! భారత్ స్థానం?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #SuryakumarYadavStunningCatch #SuryakumarYadavCatch #T20WorldCup2024 #TeamIndia #indiavsSouthAfrica #Cricket