పారిస్‌లో అవని లేఖరా ‘బంగారు విజయం’! జీవిత సవాళ్లను ఎదుర్కొని చరిత్ర సృష్టించిన భారత స్టార్!

Header Banner

పారిస్‌లో అవని లేఖరా ‘బంగారు విజయం’! జీవిత సవాళ్లను ఎదుర్కొని చరిత్ర సృష్టించిన భారత స్టార్!

  Fri Aug 30, 2024 19:10        Sports

పారిస్: పారా షూటర్ అవనీ లేఖరా (Avani Lekhara).. అద్భుతం చేసింది. ప్రస్తుతం పారిస్ వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎసెచ్ 1లో బంగారుపతకం సాధించింది. దాంతో రెండోరోజు భారత్ పతకాల జాబితాలో ఖాతా తెరిచినట్లయింది. ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ కూడా తలపడింది. ఆమె కాంస్య పతకాన్ని సాధించింది. ఇదిలాఉంటే.. టోక్యో పారాలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో పసిడి గెలిచిన 22 ఏళ్ల రాజస్థాన్ అమ్మాయి అవని.. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్లో కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పారిస్ పారాలింపిక్స్లోనూ అదే జోరు కొనసాగించి, పసిడి పతకం పట్టింది.


ఇంకా చదవండిరూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!


11 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురికావడంతో అవని కాళ్లు రెండూ చచ్చుబడిపోయాయి. అప్పటి వరకు ఆమె లోకం వేరు! చదువు తప్ప వేరే ధ్యాస లేదు. కానీ 2015 ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. వేసవి సెలవుల్లో మొదట ఆర్చరీ నేర్చుకున్న ఆమె.. తర్వాత షూటింగ్కు మళ్లింది. ఆ నిర్ణయమే ఆమెను పారాలింపిక్స్లోలో విజేతగా నిలబెట్టింది. మొదట టోక్యో, ఇప్పుడు పారిస్లో వరుస పారాలింపిక్స్లోలో 'బంగారు' కొండగా నిలిచింది. "కారు ప్రమాదం తర్వాత రెండేళ్లు పాఠశాలకు వెళ్లాను. కానీ చదువే కాక ఇంకా ఏదో సాధించాలనే తపన పెరిగింది. అప్పటి వరకు ఏ ఆటల్లోనూ ప్రవేశం లేదు. ఇండోర్ గేమ్ కావడంతో సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో 2015లో షూటింగ్ మొదలుపెట్టా. ఆసక్తి పెరగడంతో ఇదే కెరీర్ అయింది" అని ఓ సందర్భంలో అవని వెల్లడించింది. ఈ మార్చిలో ఆమెకు పిత్తాశయానికి శస్త్ర చికిత్స జరిగింది. అవన్నీ దాటుకొని పతకాన్ని నిలబెట్టుకుంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!

 

అది ఎన్నారైల కోసమేనాఅన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ!

 

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది! పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతల కీలక సమావేశం!

 

కడప ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన దస్తగిరి! తప్పు చేసిన వాళ్లకు శిక్ష!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

కువైట్‌లో ఏపీ మహిళ ఇక్కట్లు! చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలని!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 18 ఏళ్లు ఉన్నాయా.. 10 చదివారా! రూ.18,000తో ఉద్యోగంఈ ఛాన్స్ మిస్ కావద్దు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #parachute #winner #winner #Indiangirl #olympics #paris #todaynews #flashnews