మరో ఘోర ప్రమాదం.. రన్‌వేపై విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్!

Header Banner

మరో ఘోర ప్రమాదం.. రన్‌వేపై విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్!

  Tue Dec 31, 2024 11:11        Travel, World

వరుస విమాన ప్రమాదాలు కలవరపెడుతున్న వేళ మరో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. ఓ విమానం రన్‌వేపై ఉండగానే మరో విమానం టేకాఫ్ కావడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ భయపడి ‘స్టాప్, స్టాప్, స్టాప్’ అని పైలట్‌ను హెచ్చరించాడు. వాషింగ్టన్‌కు చెందిన గోంజగ యూనివర్సిటీ మెన్స్ బాస్కెట్ బాల్ జట్టు ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ రన్‌వేపై ఉండగా ఈ ఘటన జరిగింది. అయితే, వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) దర్యాప్తు ప్రారంభించింది. లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ సమయంలో రన్‌వే నుంచి రెండో విమానం టేకాఫ్ అవుతుండడంతో రన్‌వేని దాటకుండా ఉండాలని బాస్కెట్ బాల్ జట్టు సభ్యులున్న ‘కీ లైమ్ ఎయిర్ ఫ్లైట్ 563’ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఆదేశించారు. అయితే, అదే సమయంలో ఎంబ్రేయర్ ఈ135 విమానం టేకాఫ్ కావడంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ‘స్టాప్, స్టాప్, స్టాప్’ అని ప్రైవేట్ క్యారియర్‌ పైలట్‌ను హెచ్చరించాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మొదటి విమానం టేకాఫ్ అయిన తర్వాత కాసేపటికి ప్రైవేట్ జెట్ టేకాఫ్ అయింది. 

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో 9 ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!

 

జగన్ అండదండలతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి! డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #FlightAccident #LosAngelesAirport #ATCGonzagaUniversity #Federal #AviationAdministration