అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!

Header Banner

అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!

  Sun Dec 29, 2024 11:06        U S A

రికార్డు స్థాయి సందర్శకుల వీసాలు సహా మొత్తం పది లక్షలకుపైగా వలసేతర వీసాలను భారతీయులకు వరుసగా రెండో ఏడాది జారీ చేసినట్టు భారత్లోని అమెరికా ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. చదువుల కోసం తమ విద్యార్థులను అమెరికాకు పంపిన దేశాల వరసలో భారత్ టాప్లో నిలిచిందని తెలిపింది. ఈ ఏడాది 3,31,000 మందిని మనదేశం పంపినట్టు పేర్కొంది. 2008/2009 తర్వాత ఈ స్థాయిలో వేరే దేశం నుంచి అమెరికాకు చదువుల కోసం రావడం ఇదే తొలిసారి. అంతేకాదు.. అంతర్జాతీయంగా అత్యధికంగా గ్రాడ్యుయేట్లను వరుసగా రెండో ఏడాది కూడా అగ్రదేశానికి పంపిన ఘనతను కూడా భారత్ సొంతం చేసుకుంది. ఇప్పుడు అక్కడ రెండు లక్షల మంది (19 శాతం) గ్రాడ్యుయేట్లు మనదేశం నుంచి ఉన్నారు. విద్య తర్వాత పర్యాటకం, వ్యాపార అవసరాల కోసం అమెరికాను భారతీయులు సందర్శిస్తున్నారని ఈ సంస్థ తెలిపింది.

 

ఇంకా చదవండి: వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!

 

అమెరికాకు భారత్ నుంచి సందర్శకుల సంఖ్య గత నాలుగేళ్లలోనే ఐదు రెట్లు పెరిగి.. 20 లక్షలమందికి చేరిందని వివరించింది. గత ఏడాది తొలి పదకొండు నెలలతో పోల్చితే.. ఈ ఏడాది అదే కాలానికి పెరుగుదల 26 శాతమని తెలిపింది. ఇప్పటికే యాభై లక్షలమంది వలసేతర వీసాల మీద అమెరికాలో ఉన్నారని, ప్రతి రోజూ ఈ వీసాలను వేలల్లో జారీ చేస్తున్నామని తెలిపింది. మరోవైపు.. హెచ్-1బీ వీసాలను అమెరికాలోనే పునరుద్ధరించే ఆలోచనతో చేపట్టిన పైలట్ విధానం మంచి ఫలితాలను ఇచ్చిందని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనివల్ల ప్రత్యేక వృత్తి నిపుణులను అత్యధికంగా అమెరికాకు అందిస్తున్న భారత్ ఎక్కువ లబ్ది పొందనుంది. సాధారణంగా హెచ్-1బీ వీసా గడువు ముగియగానే మనవాళ్లు భారత్కు తిరిగి వచ్చి రెన్యువల్ (స్టాంపింగ్) చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన కొత్త విధానం ప్రకారం.. ఇకపై వీరు అమెరికాలోనే తమ వీసాలను రెన్యువల్ చేయించుకునే వెసులుబాటు కలగనుంది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్, డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

 

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

 

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Visa #Usa #Indian #VisaAppointment #Students