అమెరికాలో భారతీయులకు కొత్త చిక్కులు! ఆ ప్రోగ్రామ్ ను రద్దు చేయాలంటూ డిమాండ్ లు!

Header Banner

అమెరికాలో భారతీయులకు కొత్త చిక్కులు! ఆ ప్రోగ్రామ్ ను రద్దు చేయాలంటూ డిమాండ్ లు!

  Thu Jan 02, 2025 07:00        U S A

హెచ్1బీ వీసాలు అమెరికన్ల ఉపాధిని దెబ్బతీస్తున్నాయంటూ ట్రంప్ మద్దతుదారులు సహా నేటివ్ అమెరికన్లు కొత్త డిమాండ్ ను తీసుకువస్తున్నారు. ముఖ్యంగా హెచ్1బీ వీసాలు పొందేందుకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. వాటిని తొలగిస్తేనే.. అమెరికన్లకు ఉద్యోగాలు దొరుకుతాయంటూ నిరసనలు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించనుండగా.. ఈ హెచ్1బీ వీసాల్లో ఎలాంటి మార్పులు తీసుకు వస్తారో చూడాలి. 

 

హెచ్1బీ వీసాలు అమెరికన్ల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ట్రంప్ మద్దతుదారులు అలాగే నేటివ్ అమెరికన్లు ఇప్పుడు మరో కొత్త డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు. హెచ్1బీ వీసాలు పొందేందుకు ఒక షార్ట్‌కట్‌గా ఉండే ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు.

 

ఈ ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్న కొత్త అమెరికన్ల ఉపాధి అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తోందని వారు వాదిస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత ఆ విద్యార్థులు ఈ ఓపీడీ ఎఫ్-1 వీసాలపై 12 నెలల వరకు అమెరికాలో పని చేయవచ్చు. స్టెమ్ కోర్సులు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు ఏకంగా 36 నెలల వరకు ఏదైనా పని చేసేందుకు ఇది అనుమతి ఇస్తుంది.

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

నైపుణ్యాభివృద్ధి కోసం స్వల్పకాలికంగా పని అవకాశాలను కల్పించడం కోసం ఈ ఆప్షన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను తీసుకువచ్చారు. చాలా మంది విదేశీ విద్యార్థులకు ఇది ఒక వరంగా మారింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే ఈ ఓపీటీ ఎఫ్-1 వీసా కింద సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఏదైనా పని చేసి ఆలోపు మరేదైనా హెచ్1బీ వీసా కల్పించే ఉద్యోగాన్ని వెతుక్కునేవారు. అలా అమెరికాలో శాశ్వత నివాసానికి ఇది మంచి మార్గంగా మారింది. అయితే ఈ ప్రోగ్రామ్ అమెరికన్ కార్మికుల ఉపాధి అవకాశాలను అణగదొక్కుతోందని విమర్శకులు చెబుతున్నారు.

 

ఓపీటీ ప్రోగ్రామ్ నైపుణ్యాభివృద్ధి కోసం మాత్రమే ఉద్దేశించబడినది కాగా, అది విదేశీ విద్యార్థులకు వరంగా మారి హెచ్1బీ వీసాలు పొందేందుకు అవకాశం కల్పిస్తోందని, ఇది అమెరికన్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని వారు అంటున్నారు. నేటివ్ అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను చంపేసే ప్రోగ్రామ్‌గా దీనిని పేర్కొంటున్నారు.

 

కాంగ్రెషనల్ రీసెర్చ్ ప్రకారం 1.49 మిలియన్ల ఎఫ్-1, ఎమ్-1 వీసాల్లో ఏకంగా 23 శాతం ఈ ఓపీటీ ప్రోగ్రామ్ కిందే వీసాలు పొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఓపీటీ ప్రోగ్రామ్‌ను 1947లో విదేశీ విద్యార్థులకు నైపుణ్యాలు కల్పించే ఉద్దేశంతో ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత వచ్చిన రిపబ్లికన్, డెమొక్రాటిక్ ప్రభుత్వాలు ఈ ప్రోగ్రామ్ ను మరింత విస్తరిస్తూ పోయాయి. ముందుముందు ఏం జరగనుందో వేచి చూడాల్సిందే. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants