న్యూ ఇయర్ వేళ ట్రంప్ హోటల్ ముందు పేలుడు! ఉగ్రదాడే అంటున్న ఎలాన్ మస్క్!

Header Banner

న్యూ ఇయర్ వేళ ట్రంప్ హోటల్ ముందు పేలుడు! ఉగ్రదాడే అంటున్న ఎలాన్ మస్క్!

  Thu Jan 02, 2025 12:54        U S A

మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించిన లాస్ వెగాస్‌లోని ఇంటర్నేషనల్ హోటల్ ఎదుట పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే దీనిపై ఎలన్ మస్క్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ ఘటనతో పాటు న్యూ ఆర్లీన్స్ ఘటనకు సంబంధం ఉందని.. ఈ రెండు ఉగ్రదాడులుగా అనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. అయితే మస్క్ అలా అనడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 

నూతన సంవత్సరం ప్రారంభం అయిందో లేదో అమెరికాలో రెండు పేలుడు ఘటనలు సంభవించాయి. అందులో ఒకటి న్యూ ఆర్లీన్స్‌లో చోటు చేసుకోగా... తాజాగా లాస్ వెగాస్‌లో జరిగింది. అయితే ఇటీవలే జరిగిన అమెరికా ఎన్నికల్లో విజయం సాధించి మరికొన్ని రోజుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించిన ఇంటర్నేషనల్ హోటల్ ఎదుట పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ స్పందించి... ఇది ఉగ్రదాడిగా అనిపిస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఆయనకు ఎందుకలా అనిపించిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన లాస్ వెగాస్‌లోని ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల టెస్లా కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న పేలుడు పదార్థాల కారణంగానే ప్రమాదం జరిగిన పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ స్పందించారు. ప్రమాదం టెస్లా కారు వల్ల జరగలేదని.. అందులోని పేలుడు పదార్థాల వల్లే జరిగిందని వివరించారు. అలాగే దీనిపై టెస్లా సీనియర్ అధికారులు ప్రమాదానికి కారణం ఏంటని పరిశీలిస్తున్నారని తెలిపారు.

 

అంతేకాకుండా ఈ ఘటనతో పాటు జనవరి 1వ తేదీన జరిగిన న్యూ ఆర్లీన్స్‌లో ప్రమాదానికి సంబంధం ఉన్నట్లు అనిపిస్తుందని మస్క్ చెప్పుకొచ్చారు. ఈ రెండు ఉగ్రదాడులే అనిపిస్తుందని వవిరించారు. తనకు అలా అనిపించడానికి కారణం రెండు ఘటనల్లోని కార్లను.. టూర్ రెంటల్ వెబ్‌సైట్ నుంచే అద్దెకు తీసుకున్నారని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా స్పందించారు. ఇలాంటి దాడులను తాము ఖండిస్తున్నామని.. సమాజంపై దాడిని తాను అస్సలే సహించనని చెప్పుకొచ్చారు. రెండు ఘటనలపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తుందని.. ఈ రెండు ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారిస్తున్నట్లు వివరించారు.

 

ట్రంప్ హోటల్ ముందు జరిగిన పేలుడుకంటే కొన్ని గంటల ముందు న్యూ ఆర్లీన్స్‌లో 42 ఏళ్ల షంషుద్దీన్ జబ్బార్.. జనంపైకి కారును తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా... పలువురు గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో పోలీసులు కాల్పులు జరపగా.. ఎదురు దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. ముఖ్యంగా అనుమానితుడు షంషుద్దీన్‌ను కూడా పోలీసులు హతమార్చారు. అయితే ఇతడి కారులో ఐసిస్ జెండా కనిపించడంతో.. ఇది ఉగ్రదాడి అని భావిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants