ఐదు కోట్ల మంది ప్రజల కోసమే కష్టపడుతున్నా - సీఎం చంద్రబాబు! పర్యటనలో కీలక ప్రకటనలు!

Header Banner

ఐదు కోట్ల మంది ప్రజల కోసమే కష్టపడుతున్నా - సీఎం చంద్రబాబు! పర్యటనలో కీలక ప్రకటనలు!

  Tue Dec 31, 2024 16:01        Politics

ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పనులు చేయించాలనేదే తన తపన అని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా యల్లమందలో చంద్రబాబు  పర్యటించారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా సీఎం వెళ్లి.. వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో చంద్రబాబు ప్రసంగించారు.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!



"గత ఐదేళ్లు ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి. కనీసం నవ్వలేకపోయారు. ఇప్పుడు ఇంటింటికీ వచ్చి పింఛన్లు అందిస్తున్నాం. ఇంటి వద్ద కాకుండా ఆఫీస్లోలో ఇస్తే వెంటనే మెమో పంపిస్తా. ఫోన్లో జీపీఎస్ ద్వారా సమాచారం వస్తుంది. డ్రోన్లను కూడా సహాయ కార్యక్రమాల్లో వినియోగిస్తున్నాం. పేదవాళ్ల జీవితాల్లో వెలుగు చూడాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఐదు కోట్ల మంది ప్రజల కోసమే నేను కష్టపడుతున్నా. ఏ ఇంట్లో కష్టమొచ్చినా వాళ్ల ఇంట్లో నేనొక ప్రాణ స్నేహితుడిగా ఉండి వాళ్లను కాపాడుకుంటాను. నేను ఏం చేసినా అందరికీ న్యాయం జరగాలనేదే నా ఆలోచన.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



నాకు హైకమాండ్ ఎవరూ లేరు. ఐదు కోట్ల మంది ప్రజలే నాకు హైకమాండ్ " అని చంద్రబాబు అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎప్పటికీ మరిచిపోలేమని చంద్రబాబు అన్నారు. 90 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని.. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!

 

జగన్ అండదండలతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపిడెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #APCM #CBN #paryatana #todaynews #flashnews #latestupdate