మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. పేదలకు నూతన సంవత్సరం కానుక! ఇప్పటికే మొదలైన సర్వేలు.. వారికి ఇక పండగే పండగ!

Header Banner

మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. పేదలకు నూతన సంవత్సరం కానుక! ఇప్పటికే మొదలైన సర్వేలు.. వారికి ఇక పండగే పండగ!

  Wed Jan 01, 2025 07:00        Politics

పేదల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సర కానుకగా దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఇళ్ళను పేదలకు అందించడానికి గృహ సర్వే ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను వచ్చే మూడు నెలల్లో, 2025 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ 27న కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సందేశాన్ని పంపింది. అర్హులైన కుటుంబాలను గుర్తించడానికి ఆవాస్ 2024 యాప్‌ ద్వారా సర్వే ప్రారంభించాలని నిర్ణయించాం. మార్చి 31, 2025 నాటికి గృహ సర్వే పూర్తి చేయాలని పేర్కొంటూ అన్ని రాష్ట్రాలకు పంపిన సందేశంలో పేర్కొంది. 2024 లోక్‌సభ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలో, PM ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇళ్లు అందించడాన్ని హామీగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా PM ఆవాస్ (అర్బన్) పథకం కింద కోటి ఇళ్లకు సంబంధించి సర్వే ఇప్పటికే ప్రారంభమైంది అని అధికారులు తెలిపారు. PM ఆవాస్ యోజన 2016 నుండి బీజేపీకి ఒక ప్రధాన మార్గదర్శక ప్రాజెక్టుగా నిలిచింది. ఈ స్కీం ద్వారా 2029 మార్చి 31 నాటికి మూడు కోట్ల ఇళ్లు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

ఇంకా చదవండి: జగన్ ప్రభుత్వం ఆ పైసలను పక్కదారి పట్టించింది! వైసీపీ ప్రభుత్వ చీకటి జీఓలతో..

 

గృహ సర్వేను సర్వేయర్ల ద్వారా జరపడంతో పాటు పౌరులకు ఆవాస్ 2024 మొబైల్ యాప్‌ ద్వారా ఫేస్ ఆటెంటికేషన్ ఉపయోగించి స్వీయ-సర్వే నిర్వహించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే సర్వేయర్లను నమోదు చేసి, వారిని గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేసాయి. "అర్హులైన లబ్ధిదారులందరినీ చేర్చడానికి, స్వీయ-సర్వేకు వీలు కల్పించే ఫేస్ ఆధారిత ఆటెంటికేషన్ టెక్నాలజీని యాప్‌ ద్వారా అందుబాటులో ఉంచాం" అని కేంద్రం వెల్లడించింది. 2024 సెప్టెంబర్ 17న భువనేశ్వరంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన అవాస్+ మొబైల్ యాప్ పేద గ్రామీణ కుటుంబాలను గుర్తించడంలో సహాయపడటానికి రూపొందించబడింది. ఇది పేద కుటుంబాల గుర్తింపు కోసం ఆధునిక AI ఆధారిత ఫేస్ ఆటెంటికేషన్ టెక్నాలజీను వినియోగిస్తుంది. అదనపు సర్వే కోసం పౌరులు ఆధార్ ఆధారిత eKYC కూడా చేయవలసి ఉంటుంది. ఈ యాప్‌ ద్వారా పేదలకు హౌసింగ్ సహాయాన్ని సులభతరం చేస్తూ, మరింత సమగ్రమైన ప్రయోజనాలను అందించడమే లక్ష్యం.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక బాధ్యతలు! ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

 

కోటప్పకొండను సందర్శించిన చంద్రబాబు! పల్నాడు జిల్లా యల్లమందలో..

 

ఐదు కోట్ల మంది ప్రజల కోసమే కష్టపడుతున్నా - సీఎం చంద్రబాబు! పర్యటనలో కీలక ప్రకటనలు!

 

ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ కు కొత్త చార్జీలు! ఎప్పటి నుంచి అంటే!

 

వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో 9 ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!

 

జగన్ అండదండలతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి! డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Modi #AndhraPradesh #APPolitics #NaraLOkesh #Chandrababu #ModiMeeting #Anakapalli